Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

జట్టులోకి రానున్న కోహ్లి, డివిలియర్స్

kohli-villiers

న్యూఢిల్లీ: గాయాలతో ఐపిఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, డివిలియర్స్ తిరిగి జట్టులోకి రానున్నారు. ఇండోర్ వేదికగా ఏప్రిల్ 10న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు బెంగళూరు జట్టుకు మధ్య జరిగే మ్యాచ్‌లో వీరిద్దరూ అందుబాటులో ఉంటారనే ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. కోహ్లి ఐపిఎల్‌కు దూరమవ్వడంతో బెంగళూరు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన షేన్ వాట్సన్ అతడు వచ్చాక జట్టులో ఉంటాడా లేడా అనేదానిపై సందేహస్పదంగా మారింది. అయితే వాట్సన్ సారథ్యంలో సన్‌రైజర్స్ చేతిలో పరాజయం పాలైన బెంగళూరు జట్టు శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించి తొలి విజయాన్ని కైవసం సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ వాట్సన్ భారత మాజీ క్రికేటర్, సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. స్టార్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ పరిస్థితి ఎలా ఉందంటూ అడిగాడు. దానికి సమాధానంగా వాట్సన్ మాట్లాడుతూ.. పంజాబ్‌తో జరిగే తదుపురి మ్యాచ్‌లో బెంగళూరు జట్టులో కోహ్లి, డివిలియర్స్ పాల్గొంటారనే సంకేతాలు ఇచ్చాడు. గత భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌లో కోహ్లి గాయపడగా, ఐపిఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశాన్ని కోల్పోయాడు. గాయమైనప్పటికీ కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు కూడా. 120 శాతం ఫిట్‌నెస్‌గా ఉంటేనే మ్యాచ్‌లో పాల్గొంటానని ఇదివరకే కోహ్లి స్పష్టం చేశాడు. ఇటీవల బిసిసిఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) వర్గాలు కూడా కోహ్లి ఫిట్‌నెస్ విషయంలో స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ నెల రెండోవారం లోపు కోహ్లి తిరిగి ఐపిఎల్‌లోకి తిరిగే వచ్చే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాట్సన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అలాగే డివిలియర్స్ కూడా వెన్ను నొప్పితో ఐపిఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైయ్యాడు. ఇప్పుడప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్న డివిలియర్స్ కోహ్లితో పాటు తదుపరి పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో అందుబాటులోకి వచ్చేందుకు వారిద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నారంటూ చెప్పాడు. అయితే కోహ్లి లేని లోటు తీరుస్తాడనుకున్న వాట్సన్, గేల్ ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. కేదార్ జాదవ్ ఒక్కడే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకోవడంతో బెంగళూరు విజయం సాధించింది. ఏది ఏమైనా కోహ్లి తిరిగి రావాలని క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సిరీస్‌లో పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయిన విరాట్.. ఐపిఎల్ సీజన్‌లోనైనా బ్యాటింగ్‌ను ఝళిపించి భారీ స్కోరు చేస్తాడో లేదా చూడాలి.

Comments

comments