Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఆ రోజున వీరిద్దరు.. ఒకటవుతున్నారటా…!?

Virat-Anushkaభారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ ప్రేమ గురించి తెలియని వారుండరు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయినప్పటికీ.. ఈ ఏడాదిలో మళ్లీ ఈ ప్రేమ పక్షులు ఎంచక్కా కలిసిపోయారు. అయితే వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకొనే ప్రయత్నంలో ఉన్నారటా.. ఇందుకోసం జనవరి 1న నూతన సంవత్సర వేడుక సందర్భంగా విరుష్క నిశ్చితార్థం జరుగనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వీరిద్దరు తమ తమ కుటుంబాలతో ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. అయితే అక్కడి నరేంద్రనగర్‌లోని ఆనంద హోటల్‌లో ఆదివారం వీరిద్దరి నిశ్చతార్థం జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నిశ్చతార్థ వేడుకకు బచ్చన్, అంబానీ, కపూర్ల కుటుంబాలతో పాటు బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు హాజరుకాబోతున్నారటా.. వీరిద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయిన ఇన్‌స్టాగ్రాలో ఇద్దరు ఒకే రకమైన రుద్రాక్ష గొలుసు ధరించి దిగిన ఫోటోలు ఈ పుకార్లకు వూతమిచ్చినట్లుగా ఉన్నాయి.

Comments

comments