Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

విరాట్ కోహ్లికి అగ్ర స్థానం

Kohli

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) శుక్రవారం ప్రకటించిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్ర స్థానాన్ని దక్కించుకున్నాడు. 873 పాయింట్లతో విరాట్ నంబర్‌వన్ కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ డేవిడ్ వార్నర్‌ను వెనక్కి నెట్టి కోహ్లి టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. వార్నర్ 861 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. కాగా, భారత్ తరపున వన్డే ర్యాంకింగ్స్‌లో మరే భారత బ్యాట్స్‌మన్ టాప్ టెన్‌లో చోటు సంపాదించలేదు. అయితే టాప్15లో మాత్రం ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు సంపాదించారు. మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ 12వ, స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ 13వ ర్యాంక్‌ను దక్కించుకున్నారు. డాషింగ్ ఆటగాడు రోహ్లి శర్మ 14వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇక, బౌలర్ల విభాగంలో భారత స్పీడ్ స్టర్, వన్డే స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ 13వ ర్యాంక్‌లో నిలిచాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ 114 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ ర్యాంక్‌ను కాపాడు కోవాలంటే శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌ను భారత్ కనీసం 41 తేడాతో గెలవాల్సి ఉంటుంది. లేకుంటే ఇంగ్లాండ్‌కు మూడో ర్యాంక్ ఖాయమవుతోంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 113 పాయింట్లతో భారత్ వెనకాలే నిలిచింది.
లంకకు తప్పని కష్టాలు…
మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న శ్రీలంకకు భారత్‌తో జరిగే సిరీస్ చాలా కీలకంగా మారింది. 2019 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే శ్రీలంక ఈ సిరీస్‌లో కనీసం రెండు మ్యాచుల్లోనైనా భారత్‌ను ఓడించాల్సిందే. లేకుంటే వరల్డ్ కప్ బెర్త్ కోసం అర్హత మ్యాచుల్లో ఆడక తప్పదు. ఐసిసి కొత్తగా ప్రకటించిన నిబంధనల ప్రకారం వన్డే ర్యాంకింగ్స్‌లో చివరి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు మెయిన్ డ్రాకు చేరాలంటే అర్హత మ్యాచ్‌లు ఆడాల్సిందే. ఇటువంటి ప్రమాదమే పస్తుతం శ్రీలంకను వెంటాడుతోంది. ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్‌ను శాసించిన శ్రీలంక ప్రస్తుతం దయనీయ స్థితికి చేరింది. వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంక 88 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 78 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్న వెస్టిండీస్‌తో శ్రీలంకకు ప్రమాదం పొంచి వుంది. భారత్‌తో జరిగే సిరీస్‌లో లంక చిత్తుగా ఓడిపోతే మాత్రం శ్రీలంక ప్రపంచ కప్ బెర్త్ కోసం అర్హత పోటీలు ఆడక తప్పదు. కాగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటికే ప్రపంచకప్ బెర్త్‌లను దాదాపు ఖాయం చేసుకున్నాయి. శ్రీలంక, వెస్టిండీస్‌లతో పోల్చితే రేటింగ్స్‌లో ఇరు జట్లు చాలా మెరుగైన స్థితిలో ఉన్నాయి.

Comments

comments