Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

‘విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా విరాట్

Virat Kohli become Wisden Cricketer of the Year for Second Time

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది ‘విడ్జన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకోనున్నాడు. మహిళల విభాగంలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది కూడా కోహ్లీ ఈ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. గత ఏడాదిలో సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 2818 పరుగులు చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక మిథాలీ రాజ్ కూడా ప్రపంచ క్రికెట్‌లో పలు రికార్డులు నమోదు చేసింది. మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచింది. అంతేగాక అత్యధిక మ్యాచులు ఆడిన ఉమెన్ క్రికెటర్ కూడా మిథాలీనే. అలాగే వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు బాదిన ఏకైక మహిళా క్రికెటర్‌గా మిథాలీ రికార్డుకెక్కింది. గత ఏడాది మహిళల వరల్డ్ కప్‌లో సైతం తన అద్భుత ప్రదర్శనతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లింది.

Comments

comments