Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సంపాదనలోనూ విరాట్ కోహ్లి భేష్

kohli

* ఫోర్బ్ జాబితాలో ఏడో స్థానం

ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి క్రికెట్‌లోనే కాకుండా అటు సంపాదనలోనూ సత్తా చాటాడు. ఫోర్బ్ తాజాగా విడుదల చేసిన అత్యంత విలువైన టాప్10 క్రీడాకారుల్లో విరాట్ కోహ్లి ఏడో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీను సైతం వెనక్కి నెట్టి సంపాదనలో ఏడో స్థానం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టాప్ టెన్‌లో నిలిచిన ఏకైక క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఫోర్బ్ పత్రిక విడుదల చేసిన సమాచారం ప్రకారం కోహ్లి ఏడాదికి దాదాపు 93 కోట్ల రూపాయలను అర్జిస్తున్నాడు. కోహ్లి క్రికెట్‌తో పాటు వాణిజ్య ప్రకటనలు ఇతరాత్ర వ్యాపారాల ద్వారా ఏడాదికి సుమారు 14.5 మిలియన్ డాలర్లను అర్జిస్తున్నట్టు ఫోర్బ్ తన నివేదికలో తెలిపింది. సాకర్ స్టార్ మెస్సీ 83 కోట్ల రూపాయల సంపాదనతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అంతేగాక భారత్‌లో అత్యధికంగా సంపాదించే ప్రముఖుల్లో కోహ్లికి మెరుగైన స్థానం ఉందని ఫోర్బ్ తెలిపింది. కాగా, స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ 37.2 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు జమైకా దిగ్గజం స్ప్రింటర్ ఉసెన్ బోల్ట్ 27 మిలియన్ డాలర్ల సంపాదనంతో ఫోర్బ్ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. గతంలో భారత క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీలు మాత్రమే ఫోర్బ్ ప్రకటించిన సంపన్న భారత క్రికెటర్లలో చోటు సంపాదించారు. తాజాగా వారి సరసన భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా నిలిచాడు. ఇటీవల కాలంలో కోహ్లి ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా ఎదిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రముఖ వాణిజ్య సంస్థలు అతన్ని తమ ప్రచారకర్తగా నియమించేందుకు పోటీ పడుతున్నాయి. దీంతో కోహ్లి బ్రాండ్ విలువ గణనీయంగా పెరిగింది.

Comments

comments