Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

కోహ్లీ ఖాతాలో మరో ప్రపంచ రికార్డ్

Virat Kohli Breaks Another Record to Becomes Fastest to 2000 T20I Runs

మాంచెస్టర్‌: భారత జట్టు కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా మంగళవారం మాంచెస్టర్‌లో జరిగిన తొలి టీ20లో 20 పరుగులు చేసిన కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉంది. అయితే,  మెకల్లమ్ 66 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, కోహ్లీ మాత్రం 56వ ఇన్నింగ్స్‌లోనే రికార్డును అందుకోవడం విశేషం. కాగా, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో మార్టిన్ గప్టిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, మెకల్లమ్ 2140 పరుగులతో రెండో స్థానంలో, కోహ్లీ 2012 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక తొలి టీ20ల్లో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ ఆతిథ్య జట్టును 159 పరుగులకే పరిమితం చేశారు. ‘చైనామన్‌’ కుల్దీప్‌ యాదవ్‌ (5/17) మ్యాజిక్‌ బౌలింగ్‌కు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. అనంతరం 160 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కోహ్లీసేన మరో 10 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ నమోదు చేసింది. టీమిండియా ఓపెనర్ కెఎల్‌ రాహుల్‌ (54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 నాటౌట్‌) శతకంతో రాణించాడు. దాంతో భారత జట్టు ఇంగ్లండ్ పై సునాయసన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియా మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.

Comments

comments