Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ధోని రికార్డు కోహ్లి బ్రేక్!

  • విరాట్‌కు ఏడు, మిస్టర్‌కూల్‌కు ఆరు

Virat-Kohli

పల్లెకెలె : భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తన యంగ్ కెప్టెన్సీ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నా డు. ఇప్పటివరకూ స్వదేశంలో క్లీన్‌స్వీప్ సాంప్రదాయాన్ని కొనసాగించిన టీమిండియా దీంతో తొలిసారి విదేశీగడ్డపై క్వీన్‌స్వీప్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. త ద్వారా 28ఏళ్ల కోహ్లి తన సారథ్యంలో ఏడు విదేశీ టెస్టులో విజ యం సాధించిన భారత కెప్టెన్‌గా.. మహేంద్రసింగ్ ధోని పేరి ట ఉన్న విజయాల రికార్డును బద్ద లు కొట్టాడు. అంతకముందు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆరు విదేశీ టెస్టుల్లో విజయాలు సాధించగా, దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తన సారథ్యంలో 11 విజయాలు సాధించి అగ్రస్థానంలో ఉన్నాడు. దీంతో విదేశీ టెస్టుల్లో విజయం సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో విరాట్ రెండో స్థానంలో నిలిచాడు. అగ్రస్థానంలో కోహ్లి నిలవాలంటే మరో ఐదుకు పైగా విదేశీ టెస్టుల్లో విజయం సాధించాలి. కాగా, శ్రీలంకతో మూడో టెస్టు తన కెప్టెన్సీ టెస్టు కెరీర్‌లో కోహ్లికి 29వ టెస్టు.

Comments

comments