Search
Monday 24 September 2018
  • :
  • :

కోహ్లీకి మాత్రమే ఆ సత్తా ఉంది: సక్లెయిన్‌

Virat Kohli comes close to Sachin: Saqlain Mushtaq

సౌతాంప్టన్‌: క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ తెందుల్కర్‌ ప్రపంచ క్రికెట్ లో నెలకొల్పిన రికార్డులను అందుకోగల సత్తా ఒక్క విరాట్‌ కోహ్లీకి మాత్రమే ఉందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఇంగ్లండ్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ తెలిపాడు. ఇద్దరినీ పోల్చడంలేదు కానీ ప్రస్తుత క్రికెటర్లలో సచిన్‌కు దగ్గరగా రాగల సత్తా కోహ్లీకి ఉందన్నాడు. ఇటీవల విరాట్ ఆడిన కొన్ని కీలక ఇన్నింగ్స్ లు అతడు ఎంత విలువైన ఆటగాడో తెలుపుతాయని ముస్తాక్ కొనియాడాడు. అలాగే ట్రెంట్‌బ్రిడ్జ్‌లో కోహ్లీని ఆండర్సన్‌ ఎంత విసిగించినా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దన తీరు అమోఘమన్నారు. పరుగులు రాబట్టేందుకు పరితపించిపోయే విరాట్ లాంటి ప్లేయర్ టీంలో ఉంటే విజయాలు రావడం పెద్ద సమస్యేమి కాదని ముస్తాక్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ఫామ్ ను విరాట్‌ ఇలాగే కొనసాగిస్తే ఇంగ్లండ్ జట్టుకు కష్టమేనని సక్లెయిన్‌ తెలిపాడు. ఇదే సమయంలో టీమిండియా బౌలర్లు కూడా అంచనాలకు మించి రాణిస్తుండడం కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం. టీమిండియాలో ప్రస్తుతం నైపుణ్యం గల ఆటగాళ్లకు కొదవ లేదని ముస్తాక్ పేర్కొన్నాడు.

Comments

comments