Home తాజా వార్తలు హెయిర్ స్టైల్ మార్చిన విరాట్ కోహ్లీ

హెయిర్ స్టైల్ మార్చిన విరాట్ కోహ్లీ

VIRATఢిల్లీ : ఆటతోనే కాదు,ఆహార్యంతోనూ యువతను ఆకట్టుకుంటున్నాడు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఎప్పటికప్పుడు అవతారం మార్చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తన్నాడు. తాజాగా విచిత్రమైన కేశాలంకరణతో దర్శనమిచ్చాడు. పుట్‌బాలర్ల తరహాలో పక్కల్లో జుత్తు మొత్తం తీయించేసి, గడ్డం పెంచుకుని కొత్తగా దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. విరాట్ హెయిర్ స్టైల్ మార్చడంపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.