Home తాజా వార్తలు కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఔట్…

కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఔట్…

Virat Kohli hits Half Century in Birmingham Test,Second Innings

బర్మింగ్‌హామ్: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌,ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతుంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధశతకం నమోదు చేశాడు. నాలుగు ఫోర్ల సాయంతో కోహ్లీ హాఫ్ సెంచరీ బాదాడు. బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ మ్యాచ్‌లో భారత్ విజయానికి మరో 40పరుగులు కావాలి, చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఓవర్ నైట్ స్కోర్ 110/5తో  నాల్గో రోజు ఆట కొనసాగించిన భారత్ ప్రారంభంలోనే దినేష్ కార్తీక్(20) వికెట్ కోల్పోయింది. అనంతరం కోహ్లీకి పాండ్యా తోడయ్యాడు. ఈ క్రమంలో అర్ధశతకం నమోదు చేసిన విరాట్(51) స్టోక్స్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన షమీ(0) పరుగులేమి చేయకుండానే అదే ఓవర్ లో పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 141 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది.