Home స్కోర్ ఆత్మరక్షణలో విరాట్ కోహ్లి

ఆత్మరక్షణలో విరాట్ కోహ్లి

india

వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా 

ప్రధాన కోచ్ రవిశాస్త్రికీ తప్పని విమర్శల తాకిడి

క్రీడా విభాగం : కిందటి సీజన్‌లో వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన టీమిండియాకు దక్షిణాఫ్రికా చుక్కలు చూపించింది. బౌన్సీ పిచ్‌లపై భారత్ బలహీనతను సఫారీ బౌలర్లు తమకు అనుకూలంగా మార్చుకుని జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించారు. వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి పాలైన భారత జట్టు ఇంటాబయట విమర్శలతో సతమతమవుతోంది. జట్టులో చాలా మంది స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నా స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఘోర పరాజయం మూ టగట్టుకుంది. ఈ ఓటమిల ప్రభావం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రిలపై అధికంగానే కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఎదురులేని శక్తిగా కొనసాగిన కోహ్లి సౌతాఫ్రికా చేతిలో సిరీస్ కోల్పోవడంతో ఆత్మరక్షణలో ప డ్డాడు. అతనిపై రోజురోజుకు విమర్శలు పెరుగుతూనే ఉ న్నాయి. ఈ నేపథ్యంలో జట్టును ముందుండి నడిపించడం కోహ్లికి సవాలుగా మారింది. నలువైపులా నుంచి ఎదురవుతున్న విమర్శలకు సమాధానం చెప్పాలంటే చివరి టెస్టులో జట్టును గెలిపించడం ఒక్కటే అతని ముందున్న ఏకైక మా ర్గం. ఇందులో అతను సఫలమైతే తన పట్టును కాపాడుకోవడం ఖాయం. ఒకవేళ మూడో టెస్టులోనూ ఓటమి పాలైతే మాత్రం కోహ్లికి ఇబ్బందికర పరిస్థితి ఎదురు కావడం ఖా యం. రెండు టెస్టుల్లో జట్టు ఓటమికి కోహ్లి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే కారణమనే విమర్శలు ఉన్నాయి. బౌన్సీ పిచ్‌లపై మంచి రికార్డు కలిగిన అజింక్య రహానెకు తుది జట్టు లో చోటు కల్పించక పోవడం, రెండో మ్యాచ్‌లో ఫాంలో ఉన్న స్పీడ్‌స్టర్ భువనేశ్వర్‌ను పక్కన బెట్టడంపై పెను దుమారమే లేచింది. ముఖ్యంగా తొలి టెస్టులో అసాధారణ రీతిలో రాణించిన భువనేశ్వర్‌ను తప్పించడంపై కోహ్లి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ నిర్ణయాన్ని గవాస్క ర్, సెహ్వాగ్‌తో సహా చాలా మంది తీవ్రంగా తప్పుపట్టారు. కోహ్లి నియంతల వ్యవహరిస్తూ జట్టు ప్రయోజనాలను దె బ్బతీస్తున్నాడనే విమర్శలు పెరిగి పోయాయి. అతన్ని ఎలాగైన కట్టడి చేయాలని బిసిసిఐపై ఒత్తిడి పెరుగుతోంది. అ యితే ఇప్పట్లో కోహ్లికి వ్యతిరేకంగా వెళ్లే సాహసం బిసిసిఐ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ, కోహ్లి జోరుకు మాత్రం కాస్త బ్రేక్ పడిందనే వాస్తవం మాత్రం స్పష్టంగా క నిపిస్తోంది. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లికి దక్షిణాఫ్రికా సిరీస్‌లో అసలైన పరీక్షగా ఎదురైంది. ఈ పరీక్షలో అతను విఫమయ్యాడనే చెప్పాలి. జట్టును గెలిపించడంలో కెప్టెన్‌గా కోహ్లి వైఫల్యం స్పష్టంగా కనిపించింది. అతను తీసుకున్న చాలా నిర్ణయా లు జట్టుకు ప్రతికూలంగా పరిణమించాయి. దీంతో జట్టు ఓటమికి అందరు అతన్నే బాధ్యుడ్ని చేశారు. ఇలా ఇంటాబయట విమర్శలతో సతమతమవుతున్న కోహ్లికి బుధవా రం నుంచి ప్రారంభమయ్యే మూడో, ఆఖరి టెస్టు పెను స వాలు వంటిదేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోహ్లికి ఒక పరీక్షలాంటిదేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందులో కోహ్లి ఏ మేరకు సఫలమవుతాడో వేచి చూడాలి..