Search
Thursday 18 October 2018
  • :
  • :
Latest News

విరాట్ ఫిట్

  • ఏప్రిల్ 14న బెంగళూరులో ఐపిఎల్ ఆడేందుకు రెడీ

Kohli-weigh-lifting--fitnes

న్యూఢిల్లీ : భారత్ – ఆస్ట్రేలియా సిరీస్‌లో గాయపడ్డ కెప్టెన్ విరాట్ కోహ్లి తన గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2017లో ఇంతవరకు ఆడకపోవడం ఆయన అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. గత నెల ఆస్ట్రేలియాతో ఆడిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లోని మూడో టెస్ట్‌లో కోహ్లి గాయపడ్డాడు. రాంచీ టెస్ట్‌లో బంతి బౌండరీ దాటకుండా ఆపేందుకు డైవ్ చేసిన కోహ్లి భుజానికి తీవ్ర గాయమైంది. ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్ట్‌కు కూడా ఆయన దూరమయ్యారు. అంతేకాక ఐపిఎల్ 2017 ఆరంభ మ్యాచ్‌లలో కూడా ఆయన ఆడకుండా ఉన్నారు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లి తన గాయం నుంచి కోలుకున్నాడని సమాచారం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడడానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు. ఐపిఎల్ రెండో వారం మ్యాచ్‌లలో కోహ్లి ఆడేందుకు ఆయన ఫిట్‌నెస్ ఎలా ఉందన్న విషయాన్ని బిసిసిఐ వైద్య బృందం అంచనా వేసి ఆయన ఆడొచ్చా లేదా అన్నది నిర్ధరించనున్నది. దీనికి ముందు కోహ్లి తాను 120 శాతం ఫిట్‌నెస్‌గా ఉంటేనే బరిలోకి దిగుతానని అన్నారు. కోహ్లి తన పెంపుడు కుక్కతో ట్రెయినింగ్ సెషన్‌లో చురుకుగా పాల్గొనడం, తన ఫిట్‌నెస్ మెరుగుపడిందన్న దానికి సంబంధించిన విషయాలను విడియో ద్వారా తన అభిమానులకు ఎప్పటికప్పుడు తెలయజేస్తూ వచ్చారు. ఈ వారంలో ఐపిఎల్ 10వ ఎడిషన్‌లో తన మొదట మ్యాచ్ ఆడనున్నానని విరాట్ కోహ్లి తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సిబి) కెప్టెన్‌గా ఆయన పగ్గాలు అందుకుని ఏప్రిల్ 14న(శుక్రవారం) బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముంబయి ఇండియన్స్ జట్టుతో తలపడనున్నారు. తన తలపైకి వెయిట్ లిఫ్టింగ్‌లు ఎత్తి తాను ఫిట్‌నెస్‌గా ఉన్నానన్న విడియోలను కోహ్లి నెట్‌లో అప్‌లోడ్ చేశారు. ‘మైదానంలోకి రాడానికి ఇంకా నిరీక్షిస్తూ ఉండలేను, ఇప్పటికైతే దాదాపు వచ్చేసినట్లే. ఏప్రిల్ 14న ఆడతా’ అని కోహ్లి తన విడియోకు శీర్షిక పెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో మంగళవారం పోస్ట్ చేశారు. కోహ్లి లేని జట్టుతో ఆర్‌సిబి ఇంత వరకు శుభారంభాన్ని చేయలేదు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటి కూడా గెలువలేదు. ఆర్‌సిబికి మరో శుభవార్త ఏమిటంటే ఎబి డి విలియర్స్ తన గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. అయితే ఇండోర్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో సోమవారం ఆడిన ఆటలో తన పూర్తి సత్తాను చాటలేదు. అయినప్పటికీ 46 బంతుల్లో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దాంతో ఆర్‌సిబి ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Comments

comments