Search
Wednesday 26 September 2018
  • :
  • :

అబ్బే.. అలాంటిది ఏమి లేదే…!

Virat Kohli mocks media after reports of his beard insurance

న్యూఢిల్లీ: ఆటతోనే కాదు, ఆహార్యంతోనూ యువతను ఆకట్టుకుంటుంటాడు భారత స్టార్ క్రికెటర్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. ఎప్పటికప్పుడు కొత్తకొత్త హెయిర్ కట్స్ తో అవతారం మార్చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. విచిత్రమైన కేశాలంకరణ, గడ్డంతో దర్శనమిస్తుంటాడు విరాట్. వీటికి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటాడు. అయితే, గత కొన్ని రోజులుగా కోహ్లీకి సంబంధించిన ఓ పుకారు సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తోంది. కోహ్లీ తన గడ్డానికి బీమా చేయించుకున్నాడనేదే ఈ గాసిప్ సారాంశం. దీనికి మరింత బలం చేకూర్చాయి మరో ఇండియన్ క్రికెటర్ రాహుల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు. ‘నీ గడ్డానికి బీమా తీసుకున్నావన్న వార్త నేను బయటకు వెల్లడించాను’ అంటూ రాహుల్ వ్యాఖ్యానించాడు. దీంతో అభిమానులు కోహ్లీ తన గడ్డానికి బీమా చేయింకున్నది నిజం అనే అభిప్రాయానికి వచ్చారు.

అయితే తాజాగా దీనిపై కోహ్లీ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. తాను గడ్డానికి బీమా చేయించుకోలేదని, అదంతా ఓ యాడ్‌లో భాగమని చెప్పుకొచ్చాడు. విలేకర్లు ఇదే విషయమై కోహ్లీని ప్రశ్నించగా… గత కొన్నిరోజులుగా తన గడ్డంపై పెద్ద చర్చ జరుగుతుందని, తాను గడ్డానికి బీమా చేయించుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు. ఇది కేవలం ఓ యాడ్ లో భాగమేనని విరాట్ స్పష్టం చేశాడు. కాగా, ఇటీవల ముగిసిన ఐపిఎల్ పదకొండో సీజన్ లో కోహ్లీ మెడకు గాయం అయినా సంగతి తెలిసిందే. ఈ కారణంగానే కోహ్లీ కౌంటీలకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు విరాట్ బిసిసిఐ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. ఈ నెల చివరి వారంలో కోహ్లీ టీమిండియాతో కలిసి ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్నాడు.

Comments

comments