Home వార్తలు విరాట్ కోహ్లి కొత్త రికార్డు

విరాట్ కోహ్లి కొత్త రికార్డు

ఐపిఎల్ 2016లో 919 పరుగులు 

viratముంబయి: ఐపిఎల్ టి20 టోర్నమెంట్‌లో భారతీయ బాట్స్‌మెన్  విరాట్ కోహ్లి కొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపిఎల్ 2012లో క్రిస్ గేల్ 733 పరుగులు, ఐపిఎల్ 2013లో మైఖేల్ హస్సీ అత్యధిక పరుగుల రికార్డును విరాట్ కోహ్లి ఐపిఎల్ 2016లో 919 పరుగులు చేసి అధిగమించడమేకాక, కొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపిఎల్ 2016లో కోహ్లి నాలుగు శతకాలు చేశాడు. క్రిస్ గేల్‌తో కలసి అత్యధిక సెంచరీలు చేసిన ఖ్యాతిని కూడా ఈ సంవత్సరం పొందాడు. టి 20లో అత్యధిక సెంచరీలు చేసిన సంయుక్త కెప్టెన్‌గా కూడా గుర్తింపు పొందాడు. టి20లో  మైఖేల్ క్లింగర్ కూడా నాలుగు శతకాలు చేశారు. అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి ద్వితీ య స్థానంలో నిలిచారు. గేల్ 2015లో 1665 పరుగులు చేయగా, కోహ్లి 2016లో టి20లో 1544 పరుగులు చేసి రెండో స్థానంలో నిలిచారు. కోహ్లి 10 అర్ధ శతకాలు కూడా చేశారు. టి20లో 2000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో 61 ఇన్నింగ్స్‌లో 2042 పరుగులు చేశాడు. ఇదే స్టేడియంలో 40 ఇన్నింగ్స్ 1669 పరుగులు చేసిన గేల్ తర్వాత స్థానంలో  ఉన్నాడు. ఐపిఎల్‌లో కింగ్స్ ఎలెవెన్‌పై 113 నాక్‌లో 4000 పరుగులు చేసిన తొలి క్రికెటర్ కూడ కోహ్లియే. కాన్పూర్‌లో నైట్ రైడర్స్‌పై సురేశ్ రైనా కూడా 4000 పరుగులు చేసి ఈ క్లబ్‌లో చేరాడు.