Search
Friday 16 November 2018
  • :
  • :

విరాట్ కోహ్లి @ 1

టాప్ టెన్‌లో ధావన్, ఐసిసి ర్యాంకింగ్స్

Captain Virat Kohli Duck Out in India vs Srilanka Match in ICC Champions Trophy

దుబాయి: అంతర్జాతీయ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో కోహ్లి (862 పాయింట్ల)లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ఆటతో చెలరేగి పోతున్న కోహ్లి తన ర్యాంక్‌ను రెండు స్థానాలు మెరుగు పరుచుకుని టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న దక్షిణాఫ్రికా స్టార్ ఎబి.డివిలియర్స్ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. కోహ్లి 22 పాయింట్లను మెరుగుపరుచుకుని మరోసారి టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ (861) పాయింట్లతో కోహ్లి తర్వాతి స్థానంలో నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన డివిలియర్స్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత బ్యాటింగ్‌తో అలరిస్తున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా టాప్-10లో చోటు సంపాదించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ధావన్ ఐదు స్థానాలు మెరుగు పరుచుకుని పదో ర్యాంక్‌లో నిలిచాడు.

న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్ సన్ కూడా ర్యాంక్‌ను మెరుగు పరుచుకుని ఐదో స్థానంలో ఉన్నాడు. మరోవైపు బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ హాజిల్‌వుడ్ టా ర్యాంక్‌లో నిలిచాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతను 732 పాయింట్లతో మొదటి ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ రెండో, మిఛెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) మూడో, రబడా (సౌతాఫ్రికా) నాలుగో, సునీల్ నరైన్ (విండీస్) ఐదో స్థానంలో నిలిచారు. కాగా, ఆల్‌రౌండర్ విభాగంలో సాకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)కు టాప్ ర్యాంక్ దక్కింది. మహ్మద్ హఫీజ్ (పాకిస్థాన్) రెండో, మహ్మద్ నబి (అప్ఘాన్) మూడో, మాథ్యూస్ (శ్రీలంక) నాలుగో, జేమ్స్ ఫల్కనర్ (ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో నిలిచారు. టీమ్ విభాగంలో సౌతాఫ్రికా మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా రెండో, భారత్ మూడో స్థానంలో నిలిచాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు కూడా టాప్-5లో చోటు సంపాదించాయి.

Comments

comments