Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

విరాట్ కోహ్లీ.. మహా పిసినారి!

Virat-Yuviన్యూఢిల్లీ : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో మంచి ఉన్న ఆటగాడు విరాట్ కోహ్లీ. బ్యాట్‌తో తను క్రీజ్ వద్దకు వచ్చాడంటే బౌండరీల వర్షం తప్పదు.. అయితే విరాట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత ధనికులైన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. కానీ సహచర ఆటగాళ్లతో ఏదైనా పార్టీకి వెళితే.. విరాట్ అస్సలు జేబులోంచి డబ్బు తీయడంటా.. ఈ విషయాన్ని భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వెల్లడించాడు. తాజాగా ఓ రేడియో ఛానల్‌కు యువీ ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ కోహ్లీ పిసినారితనాన్ని బయటపెట్టాడు. తామంతా ఎప్పుడు కలిసి వెళ్లినా.. తానే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, ఎప్పుడైనా కోహ్లీతో డబ్బులు ఇప్పించాలంటే అతడిని చాలా బలవంతం చేయాల్సి ఉంటుందని యువీ అన్నాడు.
ఇక జట్టులో మరో పిసినారి.. అశిష్ నెహ్రా అట. చాలా కాలం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి మెరుపులు మెరిపించిన ఈ సీనియర్ బౌలర్ కూడా డబ్బులు తీయమంటే మహా బాధపడిపోతాడని యువరాజ్ అంటున్నాడు. ఏమైనా అంటే.. తనకు పెళ్లాం, పిల్లలు ఉన్నారని, అందువల్ల ఖర్చు పెట్టలేనని బీద అరుపులు అరుస్తాడట. వీళ్లిద్దరితో పాటు ఇంకా చాలా మంది క్రికెటర్లు జేబులోంచి డబ్బులు తీయడం అంటే బాగా ఇబ్బందిగానే ఉంటుందని, అయితే అందరి పేర్లూ బయటపెట్టడం బాగోదని చెప్పాడు. కోహ్లీ, నెహ్రాలతో ఉన్న సాన్నిహిత్యం దృష్టా వాళ్లిద్దరి గురించి కాస్తంత ఎక్కువగా చెప్పినట్లున్నాడు యువీ.

Comments

comments