Search
Saturday 17 November 2018
  • :
  • :

మూడో వికెట్ కోల్పోయిన భారత్

Virat-Kohli

జోహెన్నస్‌బర్గ్: వేదికగా వాండరర్స్ మైదానంలో జరుగతున్న ఆఖరిదైన మూడో టెస్టులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. అర్ధ శతకం నమోదు చేసిన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ(54) వద్ద ఎంగిడి బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పుజారా, కోహ్లీల 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు విజయ్(8), రాహుల్(0) జట్టు స్కోర్ 13 పరుగుల వద్దనే పెవిలియన్ బాటపట్టారు. అనంతరం క్రీజులోకి వచ్చిన సారథి కోహ్లీ.. పుజారాతో కలిసి ఆచితుచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ నమోదు చేసిన విరాట్ వెంటనే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(22), రహానె(03) ఉండగా… భారత్ స్కోర్: 101/3(48 ఓవర్లు).

Virat Kohli out in Johannesburg Test.

Comments

comments