Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కోహ్లీ@ నెం.01

Virat Kohli get No.01 Rank in ICC Test Rankings

దుబాయి: ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌,ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చారిత్రాత్మక తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్ లో శతకం(149), రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ(51)తో కదం తొక్కిన కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ఈ టెస్టులో భారత్ ఓటమి పాలైంది. అయితే, తాజాగా ఐసిసి విడుదల చేసిన టెస్టు బ్యాట్స్ మెన్ల ర్యాంకింగ్ లో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ను వెనక్కినెట్టి విరాట్ మొదటి ర్యాంక్ దక్కించుకున్నాడు. కాగా, బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంతో గత కొన్ని నెలలుగా క్రికెట్ కు దూరమైన స్మిత్ తన ర్యాంక్ ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఇంతకుముందు భారత్ నుంచి ఈ ఫీట్ సాధించిన వారిలో సునీల్ గవాస్కర్, వెంగ్ సర్కార్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నారు. ఈ టెస్టులో కోహ్లీ ప్రతికూల పరిస్థితుల్లోనూ అసాధారణ పోరాట పటిమ కనబరిచాడు. దీంతో విరాట్ ఆటతీరుపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వన్డే ర్యాంకింగ్స్ లోనూ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Comments

comments