Home ఛాంపియన్స్ ట్రోఫీ అభిమానం మరువలేనిది :కోహ్లి

అభిమానం మరువలేనిది :కోహ్లి

kohliబెంగళూరు: తాము చెత్త ఆటతో నిరాశ పరిచిన అభిమానులు అండగా నిలువడం తనను ఎంతో ఆనందానికి గురి చేసిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారధి విరాట్ కోహ్లి అన్నాడు. అభిమానులను నిరాశ పరిచినందుకు మరోసారి క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పాడు. ఈ మేరకు తాజాగా ఓ వీడియో సందే శాన్ని అప్‌లోడ్ చేశాడు. వచ్చే ఏడాది జట్టును విజయ పథంలో నడిపిస్తానని శపథం చేశాడు. ఈ ఏడాది తమ ఆట చాలా చెత్తగా సాగిందన్నాడు. దీనికి కెప్టెన్‌గా తానే బాధ్యత తీసుకుంటా నన్నా డు. వచ్చే సీజన్‌లో మాత్రం అభిమానులకు నిరాశ కలిగించననే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఏడాది తమకు పరిస్థితులు ఏదీ కలసి రాలేదన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలం కావ డం తమ వైఫల్యానికి ముఖ్య కారణమన్నాడు. జటులో స్టార్ ఆట గాళ్లు ఉన్నా ఫలితం లేకుండా పోయిందన్నాడు. ఇది సమష్టి వైఫ ల్యమేనన్నాడు. వచ్చే ఏడాది మాత్రం సమష్టి పోరాటంతో ముందు కు సాగుతామని కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు.