Search
Friday 21 September 2018
  • :
  • :

‘విరాట్’ విశ్వరూపం.. మూడో వన్డే భారత్ కైవసం

Virat-Kohliమొహాలీ : రెండో వన్డే విజయాన్ని తృటిలో చేజార్చుకున్న టీం ఇండియా మూడో వన్డేలో విజయాన్ని కైవసం చేసుకుంది. రెండో వన్డేలో స్వల్ప స్కోర్‌తో విఫలమైన విరాట్ కోహ్లీ మూడో వన్డేలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. బ్యాట్‌తో మైదానంలో చెలరేగిపోయి న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 134 బంతుల్లో 154 పరుగులు చేసి జట్టుకు గెలుపును కట్టబెట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. కివీస్ బ్యాటింగ్‌లో లాథమ్ 61, నీశమ్ 57, టేలర్ 44, హెన్రీ 39 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో ఉమేశ్, జావద్ తలో 3, బుమ్రా, మిశ్రా 2 చెరి రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ13, రహానే 5 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. దీంతో కష్టాల్లో పడ్డ జట్టుకు కెప్టెన్ ధోని (80)తో కలిసి విరాట్ కోహ్లీ విజయం పైపుకు నడిపించారు. 48.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసి భారత్ విజయం సాధించింది. మ్యాచ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 2-1 తేడాతో ముందంజలో ఉంది.

Comments

comments