Search
Sunday 23 September 2018
  • :
  • :

జడేజాను చూసి పకపక నవ్విన కోహ్లి

Virat-Smile

రాజ్‌కోట్: భారత ఆలౌరౌండర్ ఆటగాడు రవీంద్ర జడేజాను చూసి చూడాగానే రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి పగలబడి నవ్వేశాడు. ఇంతకీ విరాట్ ఎందుకు నవ్వాడానే కదా మీ సందేహం.. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ నవ్వుల సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో జడేజా కొత్త అవతార్‌లా దర్శనమిచ్చాడు. తన గడ్డాన్ని విభిన్నంగా కట్ చేయించుకుని ఢిపెరెంట్ లుక్‌తో కనిపించాడు. జడేజాను చూసిన కోహ్లి కడుపుబ్బేలా నవ్వాడు. జడేజా వైపు చేయి చూపిస్తూ నవ్వు ఆపుకోలేకపోయాడు విరాట్. జడేజా వైపు  చూసిన మరో ఆటగాడు ప్రవీణ్ కుమార్ కూడా కోహ్లితో పాటు పడిపడి నవ్వాడు.

అయితే ఈ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన జడేజా ట్విట్టర్‌లో ‘మైదానంలో ఆటను మార్చేశాం. డ్రెస్సింగ్ రూంలో లుక్ మార్చేశాను’ బ్రేక్ ద బీయర్డ్, రాజ్‌పుట్ బాయ్, న్యూలుక్, టైమ్ ఫర్ చేంజ్ అంటూ యాష్ టాగ్‌లతో ట్వీట్ చేశాడు. ఇటీవల ధర్మశాల మైదానంలో ఆసీస్‌తో నాలుగో టెస్టు సిరీస్ నేపథ్యంలో జడేజాతో కలిసి ఫోటోను ‘జడేజా.. బౌలింగ్ మిషన్’ అంటూ కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, రాజ్‌కోట్‌లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో బెంగళూరు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ ఆటగాడు మెక్‌కలమ్ 71 పరుగులతో ఒంటరిపోరాటం చేయగా, బెంగళూరు ఓపెనర్లు గేల్, కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌తో విజృంభించడంతో బెంగళూరు రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.

Comments

comments