Search
Monday 24 September 2018
  • :
  • :

కోహ్లి చెలరేగడం తథ్యం

  • మైక్ హస్సీ జోస్యం

MikeHussey

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుపులు మెరిపించడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు. కొన్ని సిరీస్‌లలో విఫలమైనంత మాత్రాన కోహ్లీని తక్కువ చేసి చూడలేమన్నాడు. మళ్లీ పుంజుకునే సత్తా అతని కుందన్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ టోర్న మెంట్‌లో కోహ్లి చెలరేగడం ఖాయమన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్, ఐపిఎల్‌లో కోహ్లి ఆశించిన విధింగా రాణించని విషయం వాస్తమేనన్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో అతను చెలరేగడం ఖాయమన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లి ఎప్పటికైన ప్రమాదకర ఆటగాడేనని హస్సీ అన్నాడు.
హారోహోరీ ఖాయం..
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో హోరాహోరీ పోరాటం ఖాయమని హస్సీ జోస్యం చెప్పాడు. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు చాలా పటిష్టంగా ఉన్నాయన్నాడు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగుతున్న శ్రీలంక, పాకిస్థాన్‌లను కూడా తక్కువ అంచన వేయలేమన్నాడు. ప్రతి జట్టులోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఉన్నారన్నాడు. దీంతో ప్రతి మ్యాచ్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయమన్నాడు. వన్డేల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ట్రోఫీ కోసం హోరాహోరీ పోరాటం తప్పక పోవచ్చని హస్సీ అభిప్రాయపడ్డాడు.

Comments

comments