Search
Monday 24 September 2018
  • :
  • :

విరాట్ కోహ్లికి మరో ప్రతిష్టాత్మక అవార్డు…

virat

ముంబయి: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు. వరుసగా నాలుగు సంవత్సరాల పాటు ఉత్తమ ఇంటర్నేషనల్ క్రికెటర్ కు బిసిసిఐ ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డు విరాట్ ను ఈ ఏడాది కూడా వరించింది. ఈ ఉత్తమ అవార్డును 4సార్లు గెలిచిన మొదటి క్రికెటర్ గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. జూన్ 12న జరగనున్న బిసిసిఐ అవార్డు వేడుకలో కోహ్లికి అవార్డు ఇవ్వనున్నట్టు బోర్డు గురువారం ప్రకటించింది. ”2006లో ఈ అవార్డును తొలిసారి ప్రవేశపెట్టాగా ఆ ఏడాది సచిన్ టెండూల్కర్ ఈ అవార్డును దక్కించుకున్నారు. 2007లో ఢిల్లీ క్రికెటర్ వీరేంద్రర్ సెహ్వాగ్, 2008లో గంభీర్, 2009లో సచిన్, 2010లో ద్రవిడ్, 2011లో విరాట్ కోహ్లి, 2012లో అశ్విన్, 2013లో భువనేశ్వర్‌కుమార్, 2014, 2015లతోపాటు 2016, 2017 సంవత్సరాలకు గాను మరోసారి కోహ్లి పాలి ఉమ్రిగర్ అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. మహిళల టీం విషయానికి వస్తే మొదటి సారి ఈ అవార్డును ఇవ్వనున్నారు. 2016 సీజన్‌కుగాను హర్మన్‌ప్రీత్ కౌర్, 2017 సీజన్‌కు గాను స్మృతి మందాన ఈ అవార్డు తీసుకోబోతున్నారు. బిసిసిఐ పాలనలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన దివంగత జగ్మోహన్ దాల్మియా జ్ఞాపకార్థం నాలుగు ప్రధాన అవార్డులను బిసిసిఐ వెల్లడించింది. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీని అండర్ 16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు, వికెట్లను పడగొట్టిన వాళ్లతో సహా మహిళల క్రికెట్‌లో బెస్ట్ జూనియర్, సీనియర్ కి ఈ అవార్డులను ఇవ్వనున్నారు. 9 కేటగిరీల్లో ప్రైజ్‌మనీని గతంలో ఉన్న లక్ష నుంచి లక్షన్నరకు పెంచినట్టు బిసిసిఐ  స్పష్టం చేసింది.

Comments

comments