Search
Monday 24 September 2018
  • :
  • :

కోచ్ రేసులో సెహ్వాగ్

Virender-Sehwag

ముంబయి: భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమిండియా కోచ్ రేసులో నిలిచాడు. బిసిసిఐ కోచ్ ప్రకటనకు స్పందించిన సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో కోచ్ పదవిపై ఉత్కంఠ మరింత పెరిగింది. కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని ప్రారంభంలో సహచరుల విజ్ఞప్తిని సెహ్వాగ్ తోసిపుచ్చాడు. అయితే తాజాగా అతను కోచ్ రేసులో నిలువడంతో పోటీ ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే కుంబ్లే రేసులో ఉండగా సెహ్వాగ్ కూడా దరఖాస్తు చేసుకోవడంతో కోచ్ ఎంపికపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ కూడా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కోచ్‌గా పెద్దగా అనుభవం లేకున్నా సెహ్వాగ్ పదవి కోసం రేసులో నిలువడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Comments

comments