Home స్కోర్ కొత్త కోచ్‌గా సెహ్వాగ్?

కొత్త కోచ్‌గా సెహ్వాగ్?

  • టీమిండియా కోచ్ రేసులో మాజీ డాషింగ్ ఓపెనర్
  • ఛాంపియన్స్ ట్రోఫీతో ముగియనున్న అనిల్ కుంబ్లే పదవీకాలం

virender-sehwag

న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కోచ్ రేసులో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బరిలోకి దిగనున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. టీమిండియా కోచ్‌గా అనిల్ కుంబ్లే పదవీకాలం ఈ ఛాంపియన్స్ ట్రోఫీతో ముగుస్తుండటంతో కొత్త కోచ్ ఎంపిక కోసం బిసిసిఐ కసరత్తును ప్రారంభించింది. ఏడాదికే కుంబ్లే పదవీకాలం ముగియనుండటంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని బిసిసిఐ అతనికి సూచించినట్టు తెలిసింది. కుంబ్లేతో పాటు కోచ్ రేసులో సెహ్వాగ్ కూడా బరిలోకి దిగుతున్నట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో స్పందించిన సెహ్వాగ్ కొట్టిపారేశాడు. కొత్త కోచ్ ఎంపిక విషయమై బిసిసిఐకి చెందిన అధికారి ఎవరూ తనను కలవలేదని స్పష్టం చేశాడు. అనిల్ కుంబ్లే కోచ్‌గా భారత జట్టుకు ఎన్నో వరుస విజయాలు అందించి నెంబర్‌వన్ స్థానాన్ని సాధించేలా కృషిచేయడంతో అతని కోచ్ పదవికాలాన్ని బిసిసిఐ పొడిగిస్తుందనే ఊహాగానాలు ఊపుందుకున్నాయి. ఈ నేపథ్యంలో బిసిసిఐ అందరి అంచనాలను బ్రేక్ చేస్తూ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ విషయంలో కొన్ని రోజుల పాటు సంయమనం పాటిస్తే ఎవరూ దరఖాస్తు చేస్తారో తెలిసే అవకాశం ఉంటుందని అన్నాడు. మరోవైపు బిసిసిఐ కోచ్ ఎంపిక ప్రక్రియ వైపే మొగ్గు చూపిస్తున్న తరుణంలో కొత్త కోచ్‌గా ఎంపికయ్యే వారి పదవికాలపరిమితి 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగేలా చర్యలు చేపట్టనున్నట్టు బిసిసిఐ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, సెహ్వాగ్ ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) కింగ్స్ ఎలెవన్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆస్తకికరమైన విషయం ఏమిటంటే.. ఏడాది క్రితం అనిల్ కుంబ్లేను సౌరబ్ గంగూలీ కోచ్ పదవికి దరఖాస్తు చేయమని అడిగాడట.