Search
Friday 16 November 2018
  • :
  • :

విధుల్లో నిర్లక్షం వహించిన విఆర్‌వో సస్పెన్షన్

VRO-image

ఇవోపిఆర్‌డికి షోకాజు నోటీసులు జారీ
బాధ్యతా యుతంగా పనిచేయకుంటే చర్యలు
జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి

మన తెలంగాణ/మెదక్ : విధుల్లో నిర్లక్షం వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా తన ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్న పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి శ్వేతను గురువారం కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి అ య్యుండి ప్రజలకు ఎల్లవేళలా అందుబా టులో ఉండి సేవలందించాల్సిన వారు సకా లంలో స్పందించకుండా విధి నిర్వహణలో నిర్లక్షం చేస్తే ఎంతటి ఉన్నతాధికారైనా సహించేది లేదని, శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులను హెచ్చ రించారు. గురువారం సస్పెండ్‌కు గురైన శ్వే త పంచాయతీ కార్యదర్శిగా అదే గ్రామంలో నివాసముండి ప్రజలకు ఎళ్లవేళలా అందుబా టులో ఉండాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ ఆమె బేఖాతరు చేస్తూ స్థానికంగా ఉండకుం డా నిర్లక్షంతో విధులు నిర్వహించి గ్రామం లోని పారిశుద్ధ నిర్వహణ, హరితహారంలో భాగంగా మొక్కల సంరక్షణలో పూర్తిగా వైఫ ల్యమైనందునే విధుల నుండి సస్పెండ్ చేశా మని కలెక్టర్ తెలిపారు. అంతే కాకుండా పాపన్నపేట మండల ఇవోపిఆర్‌డి సదాశివపేట మండలంలోని నందికంది, పెద్దాపూర్, పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్,రుద్రారం, లక్డారం, పాటి ఘణపురం, భానూర్ , తదితర పంచాయితీల్లో ఈ గ్రూపుల వారు ధావత్‌లు కూడా చేసుకున్నారు. కులాల వారీగా పట్టు కలిగిన వారిని జమ చేయడం,వారి మనుషులకు ఒక రోజు విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపించింది. కొత్తగా కొన్ని తండాలు కూడా పంచాయితీలుగా మారాయి. దీంతో ఇక్కడ కూడా కొత్తగా అనేక మంది రంగం సిద్దం చేసుకున్నారు. ఇంకొందరైతే తమ పేరు మీద ఎలాంటి బకాయిలు లేకుండా ఇంటి పన్ను, నల్లా పన్ను ఇతర పన్నులు చెల్లించి రశీదులను దగ్గర పెట్టుకున్నారు.ఎందుకైనా మంచిదని తమ వర్గం వారి బిల్లులను కూడా బడా బాబులు క్లియర్ చేశారు. కుల ధృవీకరణ పత్రాలను కూడా తహసిల్దార్ కార్యాలయాల నుంచి తెచ్చి పెట్టుకున్నారు. ఆఖరి నిమిషంలో ఇవన్నీ తేవాలంటే ఇబ్బంది కాబట్టి..ముందస్తుగా అన్నీ రెడీ చేసుకున్నారు. ఆర్థికంగా కూడా సిద్దమయ్యారంటే వీరిలో ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. రియల్ వ్యాపారం బాగా నడిచే గ్రామాల్లో దండిగా ఆదాయం సమకూరే అవకాశముంది. దీంతో ఈ గ్రామాల నేతలు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కలిపి వారి ఆశీర్వాదం పొందారు. కానీ…ఇంత వరకు రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కాలేదు. ఈ నెల 25 వరకు జిల్లాల్లో ఏయే పంచాయితీ ఏ వర్గానికి రిజర్వ్ అయిందో ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల సం ఘం వారు అనేక ఆదేశాలు ఇస్తున్నారు….కానీ, స్థానికంగా రిజర్వేషన్ వివరాలు పంపండం లేదు. దీంతో అన్ని రకాలుగా సిద్ధమైన పంచాయితీ అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. జిల్లాకు కేటాయించిన రిజర్వేషన్ కోటా ఆధారంగా మండలాల వారీగా గ్రామాలను ఎంపిక చేస్తారు. తద్వారా సర్పంచ్ పదవి ఏ వర్గం వారికి రిజర్వ్ అయిందో వెల్లడవుతుంది.ఈ సంగతి తేలకపోవడంతో అసలు పంచాయితీ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది అర్థం కాకుండా ఉంది. కోర్టులో కేసు ఉన్నందున ఇప్పట్లో కష్టమే అని కొందరు. ఏమో చెప్పలేం..అని ఇంకొందరు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా… గ్రామాల్లో అన్ని విధాలుగా సిద్ధమైన వారంతా రోజు రోజుకు డీలా పడుతున్నారు.

Comments

comments