Home తాజా వార్తలు విశ్వరూపం -2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల (వీడియో)

విశ్వరూపం -2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల (వీడియో)

Vishwaroopam -2 Theatrical Trailer Release (Video)

హైదరాబాద్ : విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తూ దర్శకత్వం వహించిన విశ్వరూపం-2 సినిమా థియేట్రికల్ ట్రైలర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. ఈ ట్రైలర్‌ను తెలుగులో యంగ్‌ టైగర్ ఎన్‌టిఆర్, తమిళంలో హీరోయిన్ శ్రుతిహాసన్, హిందీలో ఆమీర్‌ఖాన్‌లు విడుదల చేశారు. కమల్‌హాసన్‌కు జోడీగా పూజాకుమార్, ఆండ్రియా జెరీమియా నటించారు. రాహుల్ బోస్, శేఖర్ కపూర్, వహీదా రెహమాన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. విశ్వరూపంకు సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. ఆగస్టు 10న ఈ సినిమా విడుదల కానుంది.

Vishwaroopam -2 Theatrical Trailer Release (Video)