Home దునియా అతి చిన్న దేశం

అతి చిన్న దేశం

 

దేశం అనగానే ఎన్నో రాష్ట్రాలుంటాయి కదా.. మరి ఈ దేశం మన హైదరాబాద్ అంత కూడా ఉండదు. అదెక్కడుంది దాని విశేషాలేంటో తెలుసుకుందామా. తువాలూ అనే ఈ దేశానికి రాజధాని ఫునాఫుతి. దీని విస్తీర్ణం 26 కిలోమీటర్లు మాత్రమే.. ఇక్కడ తువాలూయన్, ఆంగ్లం మాడ్లాడుతారు.

* ఇదొక దీవి. ‘ఎలైస్ దీవులు’ అనే పేరూ కూడా ఉంది. ఈ దేశ జనాభా కేవలం పదివేలే. రోడ్లన్నీ కలిపితే ఎనిమిది కిలోమీటర్ల పొడవే ఉంటాయి. మన దగ్గర ఓ చిన్న పట్టణమంత ఉంటుందంతే.
* ఇక్కడికి వెళ్లడం అంత సులభం కాదు. ఒక దీవి నుంచి మరో దీవికి వెళ్లడానికి కూడా పడవల్లో వెళ్లాల్సిందే. దేశం మొత్తంలో ఒకే ఒక విమానాశ్రయం ఉంటుంది.
* బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఈ దేశం 1978లో స్వాతంత్య్రం పొందింది.
* రెండో ప్రపంచయుద్ధం సమయంలో జపాన్‌తో పోరాటం జరుపుతున్నప్పుడు ఈ దీవులే అమెరికా సైనిక స్థావరాలుగా ఉండేవట.
* ఎక్కడో దూరాన సముద్రం మధ్యలో కాబట్టి ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య చాలా తక్కువ. ఏడాది మొత్తంలో రెండు వేలమంది లోపే సందర్శిస్తారట.
* ఇక్కడ ‘కిలికిటి’ అనే ఆట ఆడుకుంటారు. ఇది అచ్చు మనం ఆడుకునే క్రికెట్ ఆటలానే ఉంటుంది.
* ఎక్కువ మంది వ్యవసాయం, చేపలు వేటాడటం మీదే ఆధారపడతారు. కొబ్బరిని ఎక్కువగా సాగుచేస్తారు.
* ఈ దేశ రాజధాని ఫునాఫుతిలో మాత్రమే దేశ జనాభాలో 56 శాతం మంది నివసిస్తారు.
* ఇప్పుడిప్పుడే పర్యాటకులూ ఎక్కువయ్యారు.

 

Visit Ellis Island