Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

విజువల్ వండర్

Cheliyaaమణిరత్నం దర్శకత్వంలో తమిళ్‌లో ‘కాట్రు వెలియుదాయ్’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో కార్తీ సరసన హీరోయిన్‌గా నటించింది హైదరాబాదీ భామ అదితిరావు హైదరీ. ఈ మూవీని తెలుగులో ‘చెలియా’ పేరుతో రిలీజ్ చేస్తుండగా… తెలుగు వర్షన్ నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ప్రారంభించేశారు. తాజాగా ఓ సాంగ్ టీజర్ రిలీజ్ చేసింది మణిరత్నం అండ్ టీం. ఎఆర్ రెహమాన్ సంగీతమందించిన ఈ పాట వినసొంపుగా ఉంది. 20 సెకన్ల టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండగా… అదితిరావు అందాన్ని ప్రధానంగా షోకేస్ చేశారు. ఇప్పటివరకు ఈ భామ దక్షిణాదికి అంతగా తెలియకపోవడం… ఆమె ముఖంలో కనిపిస్తున్న ఫ్రెష్‌నెస్… అన్నింటికీ మించి మణిరత్నం అందిస్తున్న విజువల్ వండర్‌లా ఉంది ఈ టీజర్. వీటికి రెహమాన్ మ్యూజిక్ కూడా తోడవడంతో అదితిరావు హైదరి మైమరపించేసింది. ఇక ఫిబ్రవరి 2న సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది సినిమా యూనిట్.

Comments

comments