Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కాలుష్యానికి విరుగుడు విటమిన్ బి

vegetable-and-Fish

శరీరాన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేవి విటమిన్ సప్లిమెంట్లు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మనం తీసుకునే విటమిన్ మాత్రలు శరీరాన్ని మరింత శిథిలం కాకుండా కాపాడతాయి. విటమిన్ బి కి సంబంధించిన సప్లిమెంట్లు పర్యావరణ కాలుష్యంతో వచ్చే ఎన్నో రకాల దుష్పరిణామాల నుంచి మనను కాపాడతా యని హాంకాంగ్ సిటీ యునివర్సిటీకి చెందిన ఎట్మాస్ఫిరిక్ ఎన్విరాన్‌మెంట్ ప్రొఫెసర్ చాక్ కె చాన్ తెలియజేస్తున్నారు. అత్యంత కాలుష్య ప్రదేశాల్లో నివసించే వారికి వీరి పరిశోధన ఉపయోగపడుతుంది.

మానవ శరీరంలోకి చేరే అతి చిన్న పరిమాణంలో ఉండే దుమ్ము కణాల వల్ల ఏర్పడే దుష్పరిణామాల నుంచి విటమిన్ బి కాపాడుతుందని ఈ పరిశోధనలు తెలియ జేస్తున్నాయి. మనిషి వెంట్రుక పరిమా ణం కంటే 30 రెట్లు చిన్నదిగా ఉండే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 ఎమ్‌ఎమ్ గా ఉండే అతి చిన్న కణాలు మానవ శరీరంలోని శ్వాసకోశంలోకి నేరుగా చేరుకుంటాయి. అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి చేరతాయి. ఇలా చేరిన కణాలు ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ రకమైన దుమ్ము కణాల మధ్యన ఎక్కువ సమయం గడిపేవారిలో ‘ఎపిజెనెటిక్’ మార్పులు ఏర్పడతాయని, కణజాలం దెబ్బతినడం, మార్పుకు లోనవడం వంటి పరిణామాలు ఏర్పడతాయని చెబుతున్నారు పరిశోధకులు.

ప్రతి గంటకు 1000 కార్లు ప్రయాణించే ప్రదేశమైన డౌన్‌టౌన్ టొరొం టోలో నివసించే కొందరిపై పరిశో ధకుల బృందం రీసెర్చ్ చేసింది. అక్కడి సభ్యులకు ప్రతిరోజు బి విటమిన్ సప్లిమెంట్, 2.5 మిల్లీ గ్రాముల ఫోలిక్ యాసిడ్, 50 మిల్లీ గ్రాముల విటమిన్ బి6, ఒక మిల్లీ గ్రాము బి12 అందించి, నాలుగు వారాల తరువాత వారిపై పడిన కాలుష్యకారకాల ప్రభావం పరిశీలించగా ఆరోగ్య క్షీణత చాలా తక్కువ మోతాదులో ఉందని తేలింది. లివర్, చికెన్, గింజధాన్యాలు వంటి వాటిల్లో బి6 సహజం గా లభించగా, చేప, మాంసం, గుడ్లు, పాలు, కొన్ని రకాల సెరెల్స్ వంటి వాటిల్లో బ12 లభిస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ దొరికే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.

Comments

comments