Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

చర్మకాంతికి విటమిన్ సి

beautyమీ శరీర రంగు చామనఛాయా? నన్ను ఎవరు లైక్ చేస్తారు? అని నిరాశపడుతున్నారా? అయితే మీరు పొరపాటు చేస్తున్నారనే చెప్పాలి. అందమైన చాలా మంది హీరోయిన్లు చామనఛాయ రంగు గలవారే. తెల్లచర్మం ఉన్నవారే అందగత్తెలు కారు.
చామనఛాయ వన్నె కలిగిన వనితల్లోనూ, ఎంతో ఆకర్షణ ఉంటుందని వీరు నిరూపించారు. కాకపోతే వీరు తమ శరీరం గురించి, చర్మసౌందర్యం గురించి కొంచెం శ్రద్ద తీసుకున్నారు అంతే.
చర్మానికి సహజంగా ఉండే రంగును మార్చడం సాధ్యం కాదనుకోండి. కానీ మంచి ఆహారం, మంచి మేకప్, ఇంటి చిట్కా వైద్యంతో మీ చర్మంలో కాంతిని తీసుకురావచ్చని బ్యూటీషియన్లు, డైటీషియన్లు డెర్మటాలజిస్టులు చెబుతున్నారు. అదెలాగో పరిశీలిద్దాం. చామనఛాయ రంగు ఉన్నవారు మేకఫ్ వేసుకునేటప్పుడు బేస్‌లో స్కిన్‌కలర్‌ను ఉపయోగించాలని, లేదా లైట్‌కలర్‌ను వాడవచ్చని, అప్పుడు లోపలి నుండి చర్మం కాంతివంతగా కనబడుతుందని ఒక బ్యూటీషియన్ చెప్పారు. లిప్‌స్టిక్, ఐ షాడోలో డార్క్ డబ్‌కలర్ ఉపయోగించాలి. కాటుక లేదా ఐ లెనర్‌ను ఉపయోగించాలి. ఎరుపు రంగున్న వారికి ధీటుగా ఇది మెరుస్తుంది. ముఖంలో ఉన్న మచ్చలు, గుంటల్ని కనిపించకుండా చేయడానికి స్కిన్ కలర్‌లో కలిసిపోయే కన్సీలర్ ఉపయోగించాలి.
లిప్‌స్టిక్ ఐ షాడోలో ఎక్కువ బ్రౌన్ షేడ్స్ ఇవ్వకండి.
లైట్ బ్రైట్ ఉపయోగించకండి. సెట్ కాకపోతే మిమ్మల్ని చూసిన వారంతా నవ్వుకుంటారు. కేవలం మేకప్‌తోనే మీరు మీ శరీరాన్ని అందంగా మార్చుకోగలరు. వీరు కొన్ని నియమాలను పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు, మీ చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. ఆహారం మారినంత మాత్రాన నల్లగా ఉన్నవారు ఎర్రగా మారిపోరు.
మంచి ఆహారంతో చర్మాన్ని కోమలంగానూ, కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. అహారనియమాల్ని పాటించకపోతే ఉన్న రంగు కూడా మరింత డల్‌గా మారుతుంది. ప్రూట్ జ్యూస్, తాజా ఆకుపచ్చని కూరలు, మొలకెత్తిన ధాన్యం తీసుకోవాలి. ఎక్కువ నీరు తాగాలి. నారింజ, ద్రాక్ష, అల్‌బకారా తీసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎన్నో రోగాల నుండి కాపాడుతుంది. చర్మరక్షణకు ఇది ఎంతో అవసరం. సూర్యుని ఆల్ట్రావయొలెట్ కిరణాల దుష్ర్పభావాల నుండి కాపాడుతుంది. చర్మంలో కోలోజెన్ శాతాన్ని పెంచుతుంది.ఇది చర్మాన్ని బిగువుగా ఉంచుతుందని డైటీషియన్లు చెపుతున్నారు. టీ, కాఫీ సేవనం మంచిది కాదంటారు. కాని ప్రతిరోజూ పాలు కలపని టీ, కాఫీ తాగితే చర్మానికి మంచి లాభం చేకూరుతుందని, ఇందులో పుష్కలంగా యాంటి ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి అల్ట్రా వయొలెట్ కిరణాల చెడు ప్రభావాల నుండి కాపాడతాయి.

Comments

comments