Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

విటమిన్ – డి లభించే ఆహారం

D-Vitamin

శరీరంలో విటమిన్ డి లోపిస్తే అనారోగ్యాలు చుట్టుముడతాయి. విటమిన్ డి లోపం వల్ల మానసిక స్థితిలో తేడా ఏర్పడడం. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం, తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడడం, ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడా రావడం, అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు పెరగడం, హృదయ, మూత్రపిండాల జబ్బులు వంటివి వచ్చే అవకాశాలున్నాయి. మహిళల్లో మెనో పాజ్ తరువాత సహజంగానే శరీరం క్యాల్షియంను శోషించుకోదు. విట మిన్ డి లోపం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. క్యాల్షియం తగ్గితే క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగు తుంది. కండరాల్లో నొప్పి, బలహీనత వంటివి ఏర్పడతాయి. పిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది.

విటమిన్-డి భర్తీకి సప్లిమెంట్లు వేసుకునే బదులుగా ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా విటమిన్ డి ఎండలో లభిస్తుంది. ఎండతో పాటు ఆహారంలో కింది వాటిని చేర్చుకుంటే లోపాన్ని నివారించవచ్చు…

ఆయిలీ ఫిష్ – సాల్మన్, ట్రాట్, ట్యూనా, మ్యాకెరల్, ఈల్ వంటి నూనె కలిగిన చేపల్లో విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. తాజా చేపలు లభించని పక్షంలో క్యాన్లలో లభించే ట్యూనా, సొర చేపలు తీసుకున్నా ఫలితం ఉంటుంది.
పోర్టొబెల్లో మష్రూమ్స్ – ఆయిస్టర్ మష్రూమ్స్ తీసుకోవడం వల్ల కూడా విట మిన్-డి పొందవచ్చు. వెజిటేరియన్లు వెంటనే వీటిని తీసుకోవడం మొదలుపెట్టవచ్చు.

పాలు – ఇప్పుడు లభించే పాలల్లో చాలా వరకు విటమిన్-డి ఫార్టిఫైడ్ ఉంటున్నా యి. ప్రతి రోజు గ్లాసు చొప్పున పాలు, పెరుగు తీసుకోవడం వల్ల కూడా విటమిన్-డిని పొందవచ్చు.

గుడ్డులోని పచ్చసొన – సాధారణంగా గుడ్డులోని పచ్చసొనను ఎక్కువమంది తినడానికి ఇష్టపడరు, కాని దీన్లో విటమిన్లు, మినరల్స్ అధికంగా లభిస్తాయి. దీన్లోనే విటమిన్-డి కూడా అధికంగా లభిస్తుంది. గుడ్డులో విటమిన్-డి తో పాటు పొటాషియం, ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ బి-12, విటమిన్ బి-6, క్యాల్షియం, ఐరన్ లభిస్తాయి.

Comments

comments