Home మన ఆరోగ్యం దీర్ఘకాల ఆరోగ్యంలో విటమిన్ల కీలక పాత్ర

దీర్ఘకాల ఆరోగ్యంలో విటమిన్ల కీలక పాత్ర

Vitamins play a vital role in long term health

కీలకమైన విటమిన్లు, లవణాలు సుదీర్ఘకాలం ఆరోగ్యవంతంగా ఉండడానికి దోహదం చేయడంతోపాటు గుండెజబ్బు, క్యాన్సర్, నరాలక్షీణత వంటి మొండి రోగాలను కూడా దూరం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 30 తెలిసిన విటమిన్లు, అత్యవసరమైన లవణాలు తగిన స్థాయిల్లో ఇంజెస్ట్ చేస్తే ఆరోగ్యకరమైన ఆయురాభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. వీటితోపాటు ప్రస్తుతానికి విటమిన్లుగా వర్గీకరించని 11అదనపు పదార్ధాలు కూడా అత్యవసరమైన సుదీర్ఘకాల విటమిన్లుగా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొడిగించే సామర్ధం కలవిగా పరిగణించ వలసి ఉంటుంది. మన కణాల్లో వందలాది వివిధ రకాల ఎంజైమ్‌లు ఉన్నందున చాలావరకు విటమిన్లు,లవణాలు అవసరమవుతాయి. అంటే అవే పోషకాలు మన ఆరోగ్యానికి ప్రతి రోజూ అవసరమవుతాయి. విటమిన్ డి,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం కూడా కీలకమైన సహాయాలుగా, ఎంజైమ్స్‌గా సుదీర్ఘకాలం మన శరీరానికి అవసరంగా పరిగణించాలి.

డిఎన్‌ఎ మరమ్మతుకు, గుండెనాళాల ఆరోగ్యానికి, ఆక్సిడేటివ్ హాని నుంచి పరిరక్షణకు ఇవి అవసరం. ముఖ్యమైన పోషకాలు శరీరానికి ఎప్పుడేతే తక్కువవుతాయో వాటిని నిర్ణీత పద్ధతిలో పొదుపుగా వాడాలి. మనకు వెంటనే ఎంజైమ్స్ లభించడం కీలకం. పునరుత్పత్తి సామర్థం సుదీర్ఘకాల భౌతికమైన అవసరాలకు ఇవి అవసరం. వ్యాధులను నయం చేయడం కన్నా వయసుతోపాటు వచ్చే శక్తి క్షీణించే వ్యాధులను ముందుగానే రాకుండా చూడడం చాలా ముఖ్యం. మెటబాలిజం,న్యూట్రిషన్,బయోకెమిస్ట్రీ,జెనెటిక్ రెగ్యులేటరీ ఎలిమెంట్స్,పోలిమార్ఫిజమ్ ఇవన్నీ అవసరమవుతాయి. పరిశోధక బృందం మొండి వ్యాధులతో విటమిన్ కె తక్కువ స్థాయి లోపాలతో ఎలిమెంట్ సెలీనియమ్ ఇవి 16,25 వివిధ రకాల ఎంజైమ్‌లకు అవసరం. రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే కీలకమైన విటమిన్ కెను నియంత్రిస్తే శరీరం ధమనులను క్లియర్ చేయడానికి అనేక ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. గుండెనాళాల జబ్బు వల్ల చనిపోయే ప్రమాదానికి దారి తీస్తుంది. అందువల్ల సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితం సాగించడానికి పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం, కూరగాయలు పండ్లు తీసుకోవాలి. చక్కెరతో కూడిన పానీయాలు తీసుకోరాదు.
                                                                                                                          – మన తెలంగాణ/సైన్స్ విభాగం

Vitamins play a vital role in long-term health

Telangana news