ఆసిఫాబాద్‌టౌన్: వివేకానందున్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కుమ్రంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. శనివారం స్థాకక ప్రేమలగార్డెన్ యువజన సర్వీసుల క్రీడ యువజనోత్సవాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక యువజన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా వివేకానందుని చిత్రపటానికి పూల మాలవేని, నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యువతి, యువకులు వారి సాంస్కృతిక యువజనులకు ఇక్కడ కూచుపుడి, మిమిక్రి, మ్యూజిక్, డ్యాన్స్, క్విజ్, తదితరులు ఇలా 30 అంశాలల్లో జిల్లాకుచెందిన వారు పాల్గొని ,జిల్లాస్థాయి నుండి రాష్ట్రస్థాయ వరకు వెళ్లాలన్నారు.
ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న ప్రతిభను కనబర్చాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో సింధు, సానియామీర్జా క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈ పోటీలలో దేశభక్తి, ఆర్థిక సామాజీక పర్యావరణ , విద్య,వైద్యం, తదితర అంశాలుఉంటాయన్నారు. ప్రతి అంశాలలో మొదటి స్థానం ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీలకు పంపిస్తామన్నారు. యువత చదువుతో పాటు అన్ని రంగాలలో రానించాలని, ఇక్కడ ఏర్పాటు చేసిన ఈవెట్లు భాగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంల్లో జిల్లా క్రీడల అభివృద్ధిశాఖ అధికారి శ్రీనివాస్, యువజన సంఘాల సర్వీస్‌ల శాఖాధికారి సంతోష్‌కుమార్, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.