Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రతి పౌరుడు వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలి

రాష్ట్ర ప్రణాళికా సంఘం  ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

Vivekananda

వనపర్తి :ప్రతి పౌరుడు స్వామి వివేకానందుని అడుగు జాడ ల్లో నడవాలని ఆయన జీవితాన్ని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు కొనసా గాలని రాష్ట్రప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  వివేకానంద 154 వ జయం తి వేడుకలకు టిడిపి, బిజెపి, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొని వివేకానంద విగ్రహా నికి పూలమాలలు వేశారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, జూలై 4 1902 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్‌లో వివేకానందుడు జన్మించారని ఆయన గుర్తు చేశారు.

బేలూరు మఠం, రామకృష్ణ మఠం,రామకృష్ణ మిషన్‌ను స్థాపించి ప్రజలకు , సమాజానికి ఉపయోగకరమైన సంస్థలను ఆయన స్థాపించారని ఆయన గుర్తు చేశారు. యువతరం విద్యలో రాణించి వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా వారు ఎదగాలని ఆయన పిలుపు నిచ్చారు. తన ధైర్యమే తనకు ఆయుధమైనప్పుడే విజయ లక్షం బానిస అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, టిడిపి నాయకులు నందిమళ్లఅశోక్, ఉంగ్లం తిరుమల్, కృష్ణ,కాగితాల గిరి, బిజెపి నాయకులు బి కృష్ణ, నారాయణ, జ్యోతి, రామన్నగారి వెంకటేశ్వర్‌రెడ్డి , రాములు, టిఆర్‌ఎస్ నాయకులు బి లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్, పాకనాటి కృష్ణయ్య, ఆవుల రమేష్, జిజె శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments