Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

వివేకానందుని ఆశయాలే ఆచరణీయం

Swamy-Vivekananda

జగిత్యాలటౌన్ : స్వామి వివేకానందుడి ఆశయాలే నేటి యువతకు ఆచరణీయమని బిజెపి జిల్లా అధ్యక్షులు బాజోజి భాస్కర్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని బిజెవైఎం ఆధ్వర్యంలో బుధవారం జగిత్యాల పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బాజోజి భాస్కర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదా యాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహానీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు.

ఈ దేశంలోని యువత విలాసాల మోజుల్లో పడి నిర్వీర్యం కాకుండా ఉండాలంటే వివేకానందుని బోధనలే శరణ్యమన్నారు. స్థానిక తహసీల్ చౌరస్తా నుండి ప్రారంభమైన కాగడాల ప్రదర్శన మోచీబజార్, టవర్‌సర్కిల్, రాంబజార్ గుండా కొత్తబస్టాండ్ వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు కరండ్ల మధుకర్, రాగిల్ల సత్యనారాయణ, జున్ను రాజేందర్, కొక్కు గంగాధర్, గణేష్, జ్ఞానేశ్వర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments