Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

వివేకానందుడి జీవితం ఆదర్శప్రాయం

VEVAKANANDA

మనతెలంగాణ/మేడ్చల్: వివేకానందుడి జీవితం యువతకు ఆదర్శప్రాయమని మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో స్వామి వివేకానంద 154వ జయంతి జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్యార్థులు సాధారణ జీవితం-అసాధారణ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు తమ లక్షాన్ని సాధించడానికి పట్టదలతో ముందుకు సాగాలని సూచించారు. స్వామి వివేకానంద యువతకు ఒక గొప్ప మార్గదర్శకుడుని, ఆయన అడుగుజాడల్లో యువత ప్రయనించాలని తెలిపారు. వివేకానందుడి దీక్ష, పట్టుదలను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. అనంతరం విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ… విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ద, ఆసక్తి ఉండాలన్నారు. సమయాన్ని ఆర్ధవంతంగా ఉపయోగించాలని, మానసిక బద్దకాన్ని వీడాలని సూచించారు. విద్యార్థులు సామాజీక యోదులుగా మారి సమాజంలోని కల్మషాలన్ని తుడిచిపెట్టి సమాజం పట్ల తమ బాధ్యత నిర్వర్తించాలన్నారు. విద్యార్థుల్లో నిద్రాణమై ఉన్న శక్తిని జాగృతం చేసి సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మల్లారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య కనక రావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వివేకానందుని అడుగుజాడల్లో నడుద్దాం
మనతెలంగాణ/కేశంపేట: ప్రతి ఒక్కరం స్వామి వివేకానందుని అడుగుజాడల్లో నడుద్దామని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పెర్కోన్నారు. వివేకానందుని జయంతిని పురస్కరించుకొని మండల పరిధిలోని కాకునూర్ గ్రామంలో వివేకానందుని విగ్రహాన్ని ఎమ్మెల్యే అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేకానందుని జీవితం యువతకు ఆదర్శమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ రాములు, నాయకులు జగదీశ్వర్‌గౌడ్, లక్ష్మీనారయణ, ప్రభాకర్‌రెడ్డి, నారయణరెడ్డి, సురేందర్, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

comments