Home సినిమా షార్ట్ ఫిల్మ్ అవార్డుల సందడి

షార్ట్ ఫిల్మ్ అవార్డుల సందడి

SIIMA-Short-Films

వివో సైమా తొలి షార్ట్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటీనటులు రానా దగ్గుబాటి, లక్ష్మి మంచు, రెజీనా కాసాండ్రా, అల్లు శిరీశ్, ప్రణీతా సుభాష్, శారదా శ్రీనాథ్ సహా, సైమా చైర్‌పర్సన్ బ్రిందా ప్రసాద్, వివో మొబైల్ సిఎమ్‌ఒ వివేక్ ఝాంగ్ పాల్గొని సందడి చేశారు.  నటుడు నవదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా వింద్యామృతం, ఉత్తమ దర్శకునిగా లక్ష్మణ్‌కృష్ణ (కృష్ణమూర్తిగారింట్లో), ఉత్తమ నటుడుగా శివకుమార్ (ఇండియన్ ఏజ్ 25), ఉత్తమ నటిగా దర్శినీశేఖర్ (కృష్ణమూర్తిగారింట్లో), ఉత్తమ సహాయనటుడిగా అంకిత్ కొయ్యా, ఉత్తమ సహాయనటిగా జాహ్నవి పైలా, ఉత్తమ హాస్యనటుడిగా రవిసాయి తేజ పైలా, ఉత్తమ సంగీత దర్శకునిగా కబీర్ రఫీలు అవార్డులు అందుకున్నారు.