Home అంతర్జాతీయ వార్తలు పుతిన్‌-కిమ్ కీలక భేటీ

పుతిన్‌-కిమ్ కీలక భేటీ

Vladimir Putinవ్లాదివోస్తోక్ : రష్యా, ఉత్తర కొరియాల అధినేత తొలి ముఖాముఖీ గురువారం జరిగింది. రష్యా పర్యటనకు వచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్‌తో రష్యా అధ్యక్షులు పుతిన్ దేశంలోని తూర్పు మారుమూల నగరం వ్లాదవోస్తోక్‌లో భేటీ అయ్యారు. అమెరికా ప్రాబల్యాన్ని అడ్డుకునే దిశలోనే ఇరువురి నేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు వెల్లడైంది. అమెరికా ఉత్తర కొరియాల మధ్య అణ్వాయుధ సంబంధిత చర్చలలో తీవ్రస్థాయి ప్రతిష్టంభన దశలో ఇక్కడ ఇరు దేశాల నేతలు తీవ్రస్థాయిలో చర్చలకు దిగారు. ఉత్తర కొరియాను తమ దారిలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ యత్నాలకు విరుగుడుగా పుతిన్ ఇప్పటి చర్చలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రధాన పాత్ర పోషించేందుకు పుతిన్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు, ఇందులో భాగంగానే కిమ్‌తో చర్చలు సాగించినట్లు విశ్లేషణలు వెలువడ్డాయి. ఇరువురు నేతలు కరచాలనం చేసుకున్న తరువాత ఇతర అధికారులు నేతలు లేకుండా రెండు గంటల పాటు ముఖాముఖీకి దిగారు. వారి సమావేశానికి ముందు ఒక కీలక సంక్షిప్త ప్రకటన వెలువడింది. సోవియట్ యూనియన్ కాలంలో ఉత్తర కొరియా వ్యవస్థాపకులు కిమ్ తాత కిమ్ 2 సాంగ్‌కు అందిన సాయం నేపథ్యంలో తిరిగి మరోసారి ఇప్పుడు చర్చల ప్రక్రియ సాగుతోందని ఇందులో తెలిపారు. చర్చలు పురోగమించుతున్నట్లు ఇరువురు నేతలు తెలిపారు. అయితే ఏఏ అంశాలపై ఇవి సాగాయనేది వారు వివరించలేదు.

Vladimir Putin and Kim Jong Un hold first summit