Search
Thursday 15 November 2018
  • :
  • :

విఎన్‌ఆర్ నాటు కాకర విత్తనాలతో బోల్తా పడ్డా రైతులు

wild-bitter

ఎకరాకు 400 పిచ్చి మొక్కలు
మండలంలో 600 ఎకరాల కాకర సాగు
విత్తన షాపులపై కరువైన అధికారుల పర్యవేక్షణ
ఖమ్మం: విఎన్ ఆర్ నాటు కాకర విత్తనాల తయారీ దారులు కాకర సాగు రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక్క పాదులో నాలుగు విత్తనాలు నాటుతే అందులో మూడు విత్తులు పిచ్చి కాకర మొక్కలే పుట్టుతున్నాయి. విత్తన వ్యాపారులను రైతులు అడిగితే పై నుండి అ విధంగా వచ్చాయి దానికి తాము ఏమీ చేయలేమని సమాధానం చెపుతున్నారని రైతులు వాపోతున్నారు. కూర గాయల పంటలపై పర్యవేక్షించాల్సిన ఉద్యానవన అధికారులు విత్తన దుకాణలపై దాడులు చేయటం లేదు సరికదా గ్రామాల్లో ఏమీ పంటలు వెస్తున్నారు. అక్కడ భూసారంను బట్టి ఎటువంటి కూరగాయల విత్తనాల విత్తాలి అనే దాని మీద అవగాహన కల్పించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు. కాకర పంటపై మన తెలంగాణ ప్రత్యేక కథనం.
మండల పరిధిలోని నారంవారిగూడెం గ్రామ పంచాయతీ, అచుతాపురం గ్రామ పంచాయతీ, అల్లిగూడెం, జమ్మిగూడెం తదిదర గ్రామాల్లో 600 ఎకరాలకుపైగా కాకర పంటను రైతులు సాగు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న కొందరు విత్తన వ్యాపారులు విఎన్‌ఆర్ నాటు రకం విత్తనాల పేరుతో నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. విఎన్‌ఆర్ విత్తనాలు పెట్టిన రైతులు నకిలీ విత్తనాలతో ఎకరా కాకార పందిరిలో వుండే సుమారు 600 పాదులల్లో 400 పాదులు పిచ్చి పాదులే మొలకెత్తుతున్నాయాని రైతులు వాపోతున్నారు. కాకర విత్తనాలు పెట్టిన మూడు నెలల వరకు చంటి పిల్లవాడిలా చాల జాగ్రత్తగా కాకర మొక్కలను సాకాలి. విత్తనం మొలకెత్తటం, తీగ పాకటం, బడుతులతో పందిరి వేయటం, ప్లాస్టిక్ తాడు అల్లటం, కాకర తీగను పందిరిపైకి పాకే లాగా ప్రతిరోజు ప్రతి పాదు పరిశీలించి పైకి ఎక్కించటం చేయాలి, ఈ ప్రక్రీయ అంతా పూర్తి అయ్యే సరికి సుమారు మూడు నెలల కాలం పడుతుంది. విఎన్‌ఆర్ విత్తనాలు పెట్టిన రైతులు మాత్రం పాదులో మొలిచిన నాలుగు తీగల్లో రెండు తీగలు పిచ్చి కాకర పాదులు పాకుతున్నాయి. పిచ్చి కాకర కాయలు కాయటంతో కాయ తెంపుదాం అనే రైతులకు వాటిని ఆందోళనకు గురిఅవుతున్నారు.

Comments

comments