Home బిజినెస్ కోల్‌కతాలో వొడాఫోన్ 4జి సేవలు

కోల్‌కతాలో వొడాఫోన్ 4జి సేవలు

4gన్యూఢిల్లీ: వొడాఫోన్ ఇండియా సోమవా రం కోల్‌కతాలో 4జి సేవలను ప్రారంభించింది. పట్టణంలో నాలుగు దశల్లో ఈ సేవలను విస్తృతం చేయను న్నామని కంపెనీ హెడ్(కోల్‌కతా, పశ్చిమబెంగాల్) ఆనంద్ సహై తెలిపా రు. కోల్‌కతాలో ఇప్పటికే ఈ సర్వీసు ల్ని ప్రయోగాత్మకం పరీక్షించి విజయం సాధించామని దీంతో ఇప్పుడు సేవల్ని అధికారికంగా ప్రారంభించామని సంస్థ భారత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నవీన్ చోప్రా చెప్పారు. తాము ఈ సేవలను ఇప్పటికే కేరళ, కర్ణాటకల్లోని సర్కిళ్లలో ప్రారంభించామని, మరో నెల రోజుల్లో ఢిల్లీ, బెంగళూరు, ముంబయి తదితర నగరాలకు తమ 4జి సేవల్ని విస్తరిస్తామని తెలిపారు. తొందరలోనే ముఖ్యమైన మెట్రో నగరాలన్నింటికీ తమ సేవల్ని విస్తరిస్తామన్నారు. మరోవైపు డే వేడుకను పురస్కరించుకుని ప్రముఖ టెలికం సర్వీసుల సంస్ధ టెలినార్ వినియోగదారులకు ఉచితంగా ఇంటర్నెట్ సర్వీసులను అందిస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 26న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను ఉచితంగా వినియోగి ంచుకోవచ్చని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ను వాడుతున్న, వినియోగించకపోయిన వారైనా ఉచితంగా ఇంటర్నెట్‌ను వినియోగించవచ్చని సంస్థ పేర్కొంది. ఉచితంగా ఇంటర్నెట్ సేవలు పొందాలంటే వినియోగదారుడు 1925కి డయిల్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.