Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

వొడాఫోన్ వినియోగదారులకు బంపర్ ఆఫర్

vodafoneకోల్‌కతా: టెలికాం దిగ్గజ సంస్థ వొడాఫోన్ తమ వినియోగదారుల కొరకు బంపర్ ఆఫ్ తీసుకొచ్చింది. పోస్టుపెయిడ్ వినియోగదారులకు అపరిమిత రోమింగ్, అపరిమిత వాయిస్ కాలింగ్, 8 జిబి డేటాను అందించనున్నట్టు వెల్లడించింది. ఈ ఆఫర్‌ను వినియోగదారులు వినియోగించుకొవడానికి నెలవారిగా రూ. 1,999లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు మరో ప్లాన్‌గా రూ. 1,699 చెల్లింపుతో ఉచిత రోమింగ్(ఇన్‌కమింగ్ కాల్స్‌కు మాత్రమే), అపరిమిత వాయిస్ కాలింగ్, 6జిబి డేటాను అందించనున్నట్టు వెల్లడించింది. రోమింగ్ కాల్స్, డేటా వాడకం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించి పోస్టుపెయిడ్ వినియోగదారుల కోసం ఈ ఆఫర్‌ను తెచ్చినట్లు వొడాఫోన్ డైరెక్టర్(కమర్షియల్) సందీప్ కటారియా తెలిపారు.

Comments

comments