Home కుమ్రం భీం ఆసిఫాబాద్ పాత విద్యా వాలంటరీలనే కొనసాగించాలి

పాత విద్యా వాలంటరీలనే కొనసాగించాలి

మన తెలంగాణ /దహెగాం: పాత విద్యా విద్యావాలంటరీలనే రెగ్యూలర్ ఉపాధ్యాయులు వచ్చే వరకు కొనసాగించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ విద్యావాలంటరీల సంఘం జిల్లా అధ్యక్షుడు నికాడి మహేష్ డిమాండ్ చేశారు. దహెగాం మండల కేంద్రంలో విద్యా వాలంటరీల మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ… హైకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం గత సంవత్సరం పని చేసిన విద్యావాలంటరీలనే కొనసాగించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, గత విద్యా సంవత్సరంకు సంబంధించిన రెండు నెలల 12 రోజుల వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. వివిద సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. విద్యావాలంటరీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దహెగాం మండల విద్యావాలంటరీల సంఘం అధ్యక్షుడు కంబాల నరేందర్, విద్యావాలంటరీలు దుర్గం చరణ్‌దాస్, సత్యనారయణగౌడ్, రౌతు సంజీవ్, తిరుపతి, రాజేష్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Volunteers Continue in This Year in Komaram Bheem