Home వనపర్తి పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధ్దం

పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధ్దం

Voter list is ready for panchayat elections

మన తెలంగాణ/ఆత్మకూర్: పంచాయతీ ఎన్నిక లకు అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. ఇప్ప టికే ఓటరు జాబితాను కొత్తగా ఏర్పాటైన పంచా యతీల వారిగా రూపొందించారు. వార్డుల వారిగా ఓటర్లు, మహిళలు, కులాలవారిగా జాబితా తయా రు చేశారు. ఆత్మకూర్ మండలంలో పురుషులు మహిళా ఓటర్ల కంటే అధికంగా ఉండగా అమరచింతలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.  ప్రభు త్వం కొత్త గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేయడంతో ఆత్మకూర్, అమర చింత మండలాలలో పంచాయితీల ముఖ చిత్రం మారింది. ఆత్మకూర్, అమరచింతలు కొత్తగా మున్సిపాలిటిలుగా ఆవిర్భవించడమేగాక… అమర చింత మండలంలో ధర్మాపూర్, చంద్రనాయక్ తండ, చింతరెడ్డి పల్లి, ఆత్మకూర్ మండలంలో బాలకిష్టాపూర్ గ్రామాలు కొత్తగ్రామ పంచాయితీలుగా  రూపు దిద్దుకున్నాయి. ఆత్మకూర్ మండలంలో 13 గ్రామ పంచాయితీలకు గాను 118 వార్డులుగా విభజించారు. మొత్తం 15,745 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 7985 మంది, మహిళా ఓటర్లు 7762 మంది ఉన్నారు. అమరచింత మండలంలో 14 గ్రామ పంచాయితీలకు గాను 120 వార్డులుగా ఏర్పాటు చేశారు.  మొత్తం 11401 మంది ఓటర్లు ఉండగా అందులో 5603 మంది పురుషులు కాగా 5798 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.  ఇదిలా ఉండగా సర్పంచ్ రిజర్వేషన్లు ఎలా వస్తుందనే ప్రచారం గ్రామాలలో సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా   ఎన్నికల నిర్వాహనలో ప్రధాన భాగమైన ఓటర్ల తుది జాబిబా తయారీ దాదాపు పూర్తి కావచ్చిందని, జూన్ ఒకటి నాటికి తుది ఓటరు లీస్టు ఖరారు కానుందని, జూన్ 4న పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కానుం దని ఆత్మకూర్ మండల అభివృద్ది అధికారి శ్రీపాద్ ‘మనతెలంగాణ’ విలేకరికి వివరించారు.