Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

కలెక్టరేట్ ఎదుట విఆర్‌ఏల ఆందోళన

 VRAs concern in front of the mahabubabad collector
మహబూబాబాద్ టౌన్ : విఆర్‌ఏలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ హామీలు ఇచ్చి నేటికి 15 నెలలు పూర్తైన ఇప్పటికి నెరవేరలేదని తక్షణమే వాటిని నెరవేర్చాలని విఆర్‌ఏల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ చుక్కల ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు వజ్జల ప్రభాకర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టి, జాయింట్ కలెక్టర్ కె దామోదర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుటుంబ సమగ్ర సర్వే నుండి నేటి భూ ప్రక్షాలన వారకు విఆర్‌ఏలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటు తమ సమస్యలు పరిష్కరించడంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. గత సంవత్సరం ఫిబ్రవరి 24 న విఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి ప్రగతి భవనంలో హామి ఇచ్చి నేటికి 15 నెలలు కావస్తున్న అమలుకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విఆర్‌ఏలకు రెగ్యులరైజేషన్ సినియారిటి ప్రకారం పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సంఘం రాష్ట్ర కమిటి పిలుపు మేరకు మే 4న సిసిఎల్‌ఎ, మే 7 న సెక్రటిరియేట్, మే 9 న ప్రగతి భవనం ముట్టడి చేస్తామన్నారు. ఈ లోపు ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. లేదంటే మే 14 న అమరణ నిరహార దీక్షకు సిద్దమని అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జటంగి యాకన్న, జిల్లా నాయకులు తోట వెంకట్, సత్తీష్, మంగిలాల్, వెంకన్న, భాస్కర్, నర్మద, రమ, సరిత, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Comments

comments