Home కామారెడ్డి ఎసిబి వలలో విఆర్ఒ

ఎసిబి వలలో విఆర్ఒ

Village Revenue Officer

కామారెడ్డి: ఓ విఆర్‌ఒ రైతు దగ్గర లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికాడు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలంలో అంబయ్య అనే రైతుకు పట్టా పాస్ బుక్ ఇచ్చేందుకు విఆర్ఒ శంకర్ రూ.10 వేలు ఇవ్వలని డిమాండ్ చేశారు. దీంతో రైతు ఎసిబి అధికారులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని అంత వివరించి చెప్పాడు. దీంతో మందుగా పన్నిన పన్నాగంతో రైతు, విఆర్ఒకు రూ.6వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ఎవరైనా లంచం ఇవ్వాలని అడిగిన్నట్లయితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియపర్చాలని కోరారు.

VRO caught by ACB while taking bribe in Kamareddy