Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

16న విఆర్‌ఒ పరీక్ష

VRO Exam will be Conduct on Sep 16

రాష్ట్ర వ్యాప్తంగా 2,945 కేంద్రాలు, ఉదయం 11కే ప్రారంభం 

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీన జరుగనున్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ (విఆర్‌ఒ) రాత పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,945 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఎ.వాణిప్రసాద్ వెల్లడించారు. రాత పరీక్ష నిర్వహణకు పోలీసు లు, ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. బుధవారం టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. విఆర్‌ఒ పరీక్షకు అత్యధికంగా హెచ్‌ఎండిఎ పరిధిలో 627 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలలో 2,87,962 మం ది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నా రు. హెచ్‌ఎండిఎ పరిధిలో పరీక్ష రాసేందుకు, కరీంనగర్ వంటి పట్టణంలో పరీక్ష రాసేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఆప్షన్ ఇచ్చుకున్నారని, అయితే ఆయా ప్రాంతాలలో కేంద్రాలలో గరిష్టంగా ఎంతమందిని కేటాయించగలుతామో అంతమందినే కేటాయించామని, కొంతమందికి దూరంగా కేంద్రాలు వేయాల్సి వచ్చిందని వివరించారు. విఆర్‌ఒ పరీక్షను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 నిర్వహించనున్నట్లు తెలిపారు.

హాల్‌టికెట్ డౌన్‌లోడ్ కోసం చివరి వరకు వేచిచూడకుండా, ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డును వెంట తీసుకువెళ్లాలని చెప్పారు. ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారని, అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకుని, పరీక్షా ప్రారంభానికి ముందే తమ ఒఎంఆర్ షీట్ ను పూరించాలని సూచించారు. ఒఎంఆర్‌పై ప్రశ్నపత్రం బుక్‌లెట్ సిరీస్ సరిగ్గా రాయాలని తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి ప్రతిజిల్లాలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 700 విఆర్‌ఒ పోస్టులకు 10,58,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, బుధవారం సాయంత్రం నాటికి 7.73 లక్షల మంది అభ్యర్థు లు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పా రు. హాల్‌టికెట్లలో పేరు తప్పుగా ముద్రించినా, ఫొటో లేకపోయినా ఆందోళన చెందవద్దని రెండు ఫొటోలతో చీఫ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాయాలని చెప్పారు. లేఖను పరిశీలించి పరీక్షకు అనుమతిస్తారని స్పష్టం చేశారు.

కార్బన్‌లెస్ కాపీ ఉండదు : విఆర్‌ఒ పరీక్షకు కార్బన్‌లెస్ కాపీ ఉండదని ఎ.వాణిప్రసాద్ స్పష్టం చేశారు. పరీక్ష ముగిసిన తర్వాత వెబ్‌సైట్‌లో అభ్యర్థి డిజిటల్ కాపీని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇటీవల జరిగిన పరీక్షలకు పరీక్ష జరిగిన 48 గంటల్లోగా డిజిటల్ కాపీలను అందుబాటులో ఉంచగా, ఈ పరీక్షకు అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున కొంత ఆలస్యం కావచ్చని చెప్పా రు. పరీక్షకు బయోమెట్రిక్ హాజరు ఉండదని స్పష్టం చేశారు. ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఇతర విలువైన సామాగ్రిని పరీక్షా హాలులోకి అనుమతించమని పేర్కొన్నారు.

Comments

comments