Home తాజా వార్తలు వివి ప్యాట్ ల వినియోగం తెలంగాణలో తొలిసారి…

వివి ప్యాట్ ల వినియోగం తెలంగాణలో తొలిసారి…

State CEO meeting with DGP on 12th of this month

 

హైదరాబాద్: దేశంలో తొలిసారిగా తెలంగాణలో ఓటర్ వెరిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పించామని వివరించారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఓటరు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని రజత్ తెలిపారు.

ఓటర్ వెరిఫికేషన్ అంటే ఏమిటి?

ఇవిఎంలతో పాటు ఓటు వేసినట్లు రశీదు ఇచ్చే పరికరం (వివి ప్యాట్) పేరు ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ అంటారు.  ఈ పరికరం వల్ల ఓటర్ తన ఓటును ఏ అభ్యర్థికి వేశాడో వివి ప్యాట్‌ల స్క్రీన్‌ పై చెక్ చేసుకోవచ్చు. ఓటరు ఏ గుర్తు అభ్యర్థికి ఓటు వేశాడో వివి ప్యాట్ స్క్రీన్‌లో ఏడు సెకన్లపాటు రశీదు మనకు కనపడుతుంది.  ఆ తరువాత ప్యాట్ మిషన్ కింద ఉన్న బాక్సులో ఆ రశీదు పడిపోతుంది.