Search
Monday 24 September 2018
  • :
  • :

మృతదేహం కోసం 30 గంటలా?

మంజియనాయక్ మృతదేహంతో గిరిజనుల ఆందోళన

పోలీసులతో  వాగ్వాదం,

బాధ్యులపై చర్యలకు డిమాండ్ ,

మద్దతిచ్చిన నాయకులు

Dead-Body1

ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఇటిక్యాల తం డాకు చెందిన మంజియనాయక్ (80) శనివారం ఆది లాబాద్ సబ్ జైలులో గుండెపోటులో మృతి చెంది న విషయం తెలిసిందే. కాగా, ఆదివారం మృతదేహాన్ని తీసుకె ళ్లేందుకు పెంబి మండల కేంద్రంలోని పరిసర ప్రాంతానికి చెందిన గిరిజనులు వేయి మందికి పైగా తరలివచ్చారు. మంజియనాయక్ చనిపోయి 30 గంట లు గడుస్తున్నా మృతదేహం అప్పగించడం ఆలస్యం కా వడంతో ఒక్కసారిగా వారిలో ఆగ్రహం వ్యక్తమైంది. దీం తో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అటు గా వెళ్తున్న మాజీ ఎంపి రాథోడ్ రమేశ్ అక్కడకు చేరుకొని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబాయిలో చనిపోయిన వ్యక్తి శవాన్ని ఒక్కరోజులోనే తరలిస్తారని, ఆదిలాబాద్‌లో చనిపోయి న వ్యక్తి శవాన్ని రెండు రోజులైనా పెంబికి తరలించడం లో ప్రభుత్వం నిర్లక్షం వహించిందన్నారు.

ఇదే సమ యంలో మృతదేహాన్ని అక్కడికి తీసుకురావడంతో ఉద్రి క్తత చోటుచేసుకుంది. మంజియ నాయక్ ఎలా తీసుకె ళ్లారో.. అలాగే అప్పజెప్పాలని స్టేషన్ ఎదుట శవాన్ని ఉంచి వెళ్లిపోయారు. అతడి మృతికి బాధ్యులైన సిఐ న రేశ్‌కుమార్, ఎస్‌ఐ సంజీవ్‌కుమార్, కానిస్టేబుల్ పురు షోత్తంను వెంటనే సస్పెండ్ చేయాలని గంట పాటు రా స్తారోకో చేశారు. అలాగే బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేసియా చెల్లిం చాలని డిమాండ్ చేశారు. పోలీసుల నుంచి ఎలాం టి స్పందన రాకపోవడంతో కోపోద్రిక్తులైన గిరిజనులు స్టే షన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు.

డిఎస్‌పి మనో హర్‌రెడ్డి గిరిజనులకు నచ్చజెప్పి లిఖితపూర్వకంగా ఫి ర్యాదు చేస్తే పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. దీంతో మాజీ ఎంపి రాథో డ్ రమేశ్, కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జిలు హరినాయక్, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసి నాయకులు నందిరామయ్య, ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు వెంకట్‌రావ్‌లు లిఖిత పూర్వ కంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న డిఎస్‌పి ఎస్‌పికి ఫోన్‌లో సమాచారం అందించారు. మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చా రు. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో వారు శాంతించి మృతదేహాన్ని తీసుకొని వెళ్లారు.

Comments

comments