Search
Wednesday 21 November 2018
  • :
  • :

గోడలను ఎక్కే రోబో

ROBOబెర్లిన్ : సులువుగా గోడలను ఎక్కే తేలికపాటి రోబోను సైంటిస్టులు అభివృద్ధి చేశారు. త్రీడీ ప్రింటర్ ముద్రించిన విడి భాగాలతో వెర్టిగో తయారైందని సైంటిస్టులు వెల్లడించారు. రిమోట్ సంకేతాల ద్వారా నియంత్రించగల ఈ రోబోను డిస్నీ, ఈటీహెచ్ జురిచ్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసినట్టు సైంటిస్టులు తెలిపారు. ఈ రోబోకు నాలుగు చక్రాలతో పాటు రెండు చోదకాలు ఉన్నాయని, ఇవి గోడను ఎక్కేందుకు పోటు ఇస్తాయని సైంటిస్టులు పేర్కొన్నారు. దీనికి కర్బన ఫైబర్ ప్లేట్ వంటి అత్యంత తేలికపాటి పరికరాలను అమర్చినట్టు వారు తెలిపారు. దీనికి అమర్చిన ఎనిమిది యాక్టువేటర్లు , ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ల సహాయంతో నిర్దేశిత ప్రదేశాలకు వెళ్లగలదని సైంటిస్టులు చెప్పారు.

Comments

comments